భయానకం: కదులుతున్న రైలులో స్టంట్స్ చేసి, ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు(వీడియో)

న్యూఢిల్లీ: రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఓ భయంకరమైన టిక్‌టాక్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్‌లో వేలాడుతూ ప్రయాణం చేస్తున్నాడు. హఠాత్తుగా అదుపుతప్పి అతడు కిందపడిపోతాడు. రైలు కింది వరకు వెళ్లితిరిగి బయటపడతాడు.

అంతా అతడు చనిపోయాడనే అనుకుంటారు. కానీ, అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడతాడు. తీవ్రగాయాలు మాత్రం అయినట్లు తెలుస్తోంది. మిగితా ప్రయాణికులు అతడ్ని అక్కడే ఉండాలని సూచిస్తారు. ఇదంతా రైలులో ప్రయాణించే ఇతర ప్రయాణికులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌లో పోస్టు చేశారు.

Piyush Goyal Shares Horrifying TikTok Video Of Train Stunt Gone Wrong

ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోనే రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఏడు నిమిషాల ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. జీవితం చాలా విలువైనదని... ఇలాంటి మూర్ఖత్వంతో దాన్ని ప్రమాదంలో నెట్టకండి అని ఆయన హితవు పలికారు. కదులుతున్న రైలులో ఇలాంటి విన్యాసాలు చేయడం మూర్ఖత్వమేనని అన్నారు.

Recommended Video

    Budget 2019 : Assured Income Of Rs 6000 For Farmers Announced | Oneindia Telugu

    నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుని జీవితాలను ప్రమాదాల్లో పెట్టుకోవద్దని కేంద్రమంత్రి సూచించారు. ఆయన చేసిన ఈ వీడియోను 10వేల మందికిపైగా వీక్షించారు. చాలా మంది నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేశారు. కేంద్రమంత్రి చెప్పింది అక్షర సత్యమని, ఇలాంటి పనులు మూర్ఖత్వానికి నిదర్శనమేనని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రాణాలకు అపాయమని తెలిసినా.. యువత ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుండటం విచారకరం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+