Plan B: అన్నంలో విషం పెట్టి భర్తను చంపిన భార్య, అత్త దెబ్బకు కోడలికి అదిరిపోయింది, ఫినిష్ !

చెన్నై/తిరునల్వేలి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య తేడాలు వచ్చాయి. ఇటీవల భర్త ఎలాంటి పని చెయ్యకుండా గాలికి తిరుగుతున్నాడు. రాత్రి అయితే పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యతో ఓ విషయంలో గొడవపడుతున్నాడు. మూడు నెలలుగా దంపతుల మద్య ఇదే పంచాయితీ జరుగుతోంది. రాత్రి భోజనం చేసిన భర్త తరువాత వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లే సమయానికి అతని ప్రాణం పోయింది. ఐస్ బాక్స్ లో శవం పెట్టి అంత్యక్రియలు చెయ్యడానికి సర్వం సిద్దం చేశారు. చనిపోయిన వ్యక్తి తల్లి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. అత్త దెబ్బకు కోడలికి సినిమా కనపడింది.

 ముగ్గురు పిల్లలు ఓకే

ముగ్గురు పిల్లలు ఓకే

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా (నెలై)లోని కుట్టం సమీపంలోని కుంజన్ విలైలో శివకరవేలన్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మేస్త్రీ పని చేస్తున్న శివకరన్ వేలన్ కొన్ని సంవత్సరాల క్రితం జయ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న శివకరన్ వేలన్, జయ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. శివకరన్ వేలన్, జయ దంపతులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

గాలికి తెగ తిరిగేస్తున్న భర్త

గాలికి తెగ తిరిగేస్తున్న భర్త

పిల్లలు పుట్టిన తరువాత శివకరన్ వేలన్, జయ దంపతుల మద్య తేడాలు వచ్చాయి. కొన్ని నెలల నుంచి శివకరన్ వేలన్ ఎలాంటి పని చెయ్యకుండా గాలికి తిరుగుతున్నాడు. పిల్లలను పోషించడానికి జయ బయటకు వెళ్లి కూలిపని చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జయ బయట ఉంటోంది.

 భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

భార్య జయ బయటకు వెళ్లి వస్తుండటంతో ఆమె భర్త శివకరన్ వేలన్ ను ఆమె మీద అనుమానం ఎక్కువ అయ్యింది. రాత్రి అయితే పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న శివకరన్ వేలన్ అతని భార్య జయతో నువ్వు ఎందుకు ఎక్కువగా బయట ఉంటున్నావు అనే విషయంలో గొడవపడుతున్నాడు.

భర్తకు అన్నంలో విషం పెట్టి చంపేసిన భార్య

భర్తకు అన్నంలో విషం పెట్టి చంపేసిన భార్య

మూడు నెలలుగా శివకరన్ వేలన్, జయ దంపతుల మద్య ఇదే పంచాయితీ జరుగుతోంది. రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త శివకరన్ వేలన్ కు అతని భార్య అన్నం పెట్టింది. జయ ముందుగానే అన్నంలో విషం కలిపేసింది. రాత్రి భోజనం చేసిన శివకరన్ వేలన్ కొన్ని గంటల తరువాత వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడు.

ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన తల్లి

ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన తల్లి

అదే సమయంలో శివకరన్ వేలన్ తల్లి మూకమ్మాల్ అక్కడికి వెళ్లింది. స్థానికుల సహాయంతో కొడుకు శివకరన్ వేలన్ ను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లింది. అయితే అప్పటికే శివకరన్ వేలన్ ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. ఐస్ బాక్స్ లో శివకరన్ వేలన్ శవం పెట్టి అంత్యక్రియలు చెయ్యడానికి సర్వం సిద్దం చేశారు.

అత్త దెబ్బకు కోడలికి సినిమా కనపడింది

అత్త దెబ్బకు కోడలికి సినిమా కనపడింది

అనుమానాస్పదంగా తన కొడుకు శివకరన్ వేలన్ చనిపోయాడని, కేసు విచారణ చెయ్యాలని అతని తల్లి మూకమ్మాల్ కేసు పెట్టడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దెబ్బకు సీన్ మొత్తం మారిపోయింది. జయ పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులు ఆమెకు బెండ్ తీశారు.

 బెండ్ తీస్తే భార్య అసలు మ్యాటర్ చెప్పింది

బెండ్ తీస్తే భార్య అసలు మ్యాటర్ చెప్పింది


ఇదే షయంలో విష ప్రయోగంతో శివకరన్ వేలన్ చనిపోయాడని పోస్టుమార్టం నివేదిక వచ్చింది. రోజు మద్యం సేవించి వచ్చి తన భర్త శివకరన్ వేలన్ తనను టార్చర్ పెడుతున్నాడని, అందుకే విషం పెట్టి హత్య చేశానని జయ అంగీకరించిందని, ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించామని తిరునల్వేలి జిల్లా పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+