Plan B: యువకుడి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, హాలీవుడ్ సినిమా స్కెచ్ తో హత్య, లేడీ డీల్ తో ?
బెంగళూరు/ఉడిపి: ఓ యువకుడు అతని దూరపు బందువుతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. యువకుడి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల యువకుడు అటవి ప్రాంతంలో చెట్టుకువేలాడుతూ శవమై కనిపించాడు. యువకుడి శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడి జోబులో డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. యువకుడు స్వయంగా అతని చేతితో రాసిన డెత్ నోట్ కావడంతో ఆత్మహత్య కేసు నమోదు చేశారు. యువకుడికి అత్తకు అనుమానం వచ్చి పోలీసు కేసు పెట్టింది, పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళను తెర మీదకు తెచ్చి హాలీవుడ్ సినిమా టైప్ లో యువకుడిని హత్య చెయ్యడానికి అతనితోనే అన్నీ చేయించారని వెలుగు చూడటం కలకలం రేపింది.

చెట్టుకు శవమైన యువకుడు
కర్ణాటకలోని ఉడిపి సమీపంలోని హిరియాడ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని బజే- కుక్కేహళ్లి రహదారి సమీపంలోని అటవి ప్రాంతంలో కృతిక్ జే. సాలియాన్ అలియాస్ సాలియాన్ (22) అనే యువకుడు చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు. కృతిక శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారరం ఇచ్చారు. పోలీసులు కృతిక్ ప్యాంట్ జోబులో డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మహత్య కేసు
కృతిక్ స్వయంగా అతని చేతితో రాసిన డెత్ నోట్ కావడంతో ఆత్మహత్య కేసు నమోదు చేశారు. కృతిక్ మొబైల్ ఫోన్ లో ఓ మహిళ గురించి మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడిన వీడియో కూడా ఉండటం, కృతిక్ స్వయంగా మెడకు తాడు బిగించుకుంటున్న సమయంలో వీడియో ఉండటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు.

అత్తకు అనుమానం రావడంతో అసలు మ్యాటర్ లీక్
కృతిక్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని అతని అత్త శైలజాకు అనుమానం వచ్చి పోలీసు కేసు పెట్టింది, పోలీసుల విచారలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృతిక్ శవమై కనిపించకముందు బ్యాంక్ లోకి వెళ్లి రూ. 1 లక్ష డబ్బులు డ్రా చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

బంధువుకు రూ. 9 లక్షలు ఇచ్చాడు
పోలీసులు విచారణలో ముంబాయిలో ఉద్యోగం చేస్తున్న దినేష్ సఫలగ అలియాస్ దినేష్ (44) అనే వ్యక్తి పేరు తెర మీదకు వచ్చింది. కృతిక్ కు దినేష్ దూరపు బంధువు. రెండు మూడు సంవత్సరాల నుంచి కృతిక్ అతని బంధువు దినేష్ కు రూ. 9 లక్షల వరకు అప్పు ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

హాలీవుడ్ సినిమా స్కెచ్
చేసిన అప్పు తీర్చలేక, అప్పు ఇచ్చిన కృతిక్ ను చంపేయాలని దినేష్ స్కెచ్ వేశాడు. తనకు పరిచయం ఉన్న మహిళత కృతిక్ కు వల వేయించిన దినేష్ ఆమె లేకుంటే నేను బతకలేను అనే టైపులో కృతిక్ మనుసుమార్చేశాడు. తరువాత నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని నువ్వు బెదిరించాలని కృతిక్ ను దినేష్ రెచ్చగొట్టాడని, ఆమె ను బెదిరించడానికి నువ్వు నటించాలని చెప్పాడని పోలీసులు అన్నారు.

నమ్మించి చంపేశాడు
దినేష్ మాటలు నమ్మిన కృతిక్ మహిళను బెదిరించడానికి స్వయంగా డెత్ నోట్ రాశాడని, తరువాత రాళ్ల మీద నిలబడి చెట్టుకు తాడు కట్టి అతనే మెడకు వేసుకున్నాడని, నమ్మించి మోసం చేసిన దినేష్ కృతిక్ కాళ్ల కింద ఉన్న రాళ్లు తోసేయడంతో అతని ప్రాణం పోయిందని పోలీసులు అన్నారు. కృతిక్ ను నమ్మించి అతన్ని హత్య చేసిన దినేష్ ను ఉడిపి పోలీసులు అరెస్టు చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications