రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా వరుస భేటీలు.. ఏం చేయబోతున్నారో..?
రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతూ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంటల వ్యవధిలో విడివిడిగా సమావేశమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం మోడీ రాష్ట్రపతితో భేటీ కాగా, సాయంత్రం అమిత్ షా రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకే రోజున ప్రధాని, హోంమంత్రి రాష్ట్రపతితో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ కీలక భేటీల్లో ఏయే అంశాలపై చర్చ జరిగిందనేది మాత్రం గోప్యంగా ఉంది. అయితే, ప్రస్తుతం జూలై 21న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీలు జరిగాయి. ముఖ్యంగా, ఈ సమావేశాల్లో 'ఆపరేషన్ సింధూర్'పై కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో, ప్రధాని, హోంమంత్రుల రాష్ట్రపతి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

సాధారణంగా, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ కీలక నిర్ణయాలు, బిల్లులు లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై రాష్ట్రపతికి సమాచారం అందించడం జరుగుతుంది. అయితే, విడివిడిగా భేటీ అవ్వడం, చర్చనీయాంశమైన 'ఆపరేషన్ సింధూర్'పైనే ప్రధానంగా చర్చ జరిగి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీల వెనుక ఉన్న అసలు కారణాలు, వాటి తక్షణ ప్రభావం ఏమిటన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications