వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలించిన రైతన్నల పోరాటం; సాగు చట్టాల రద్దు కోసం సాగిన అన్నదాతల ఉద్యమ ప్రస్థానం ఇదే !!

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులలో కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు సాగించిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కేంద్రం దిగి వచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తి కావస్తున్న సమయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనను కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో మంది రైతులు ఈ ఉద్యమ ప్రస్థానం లో ప్రాణాలు కోల్పోయినా సరే మొక్కవోని దీక్షతో రైతన్నలు సాగించిన పోరాటం చరిత్రపుటల్లో నిలిచింది. 3 సాగు చట్టాలను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పిన సర్కార్ రైతుల అకుంఠిత దీక్షకు దిగి రావలసి వచ్చింది.

నవంబర్ 25వ తేదీన మొదలైన ఉద్యమ ప్రస్తానం .. ఆది నుండీ హింసాత్మక ఘటనలే

నవంబర్ 25వ తేదీన మొదలైన ఉద్యమ ప్రస్తానం .. ఆది నుండీ హింసాత్మక ఘటనలే

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపైరైతులుచలో ఢిల్లీ పేరుతోనిరసనలు మొదలుపెట్టి ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న ఆందోళనకు నవంబర్ 25వ తేదీన శ్రీకారం చుట్టారు. పంజాబ్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్ , కర్ణాటక వంటి రాష్ట్రాల నుండిరైతులుచలో ఢిల్లీ అంటూ ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. రైతులు చలో ఢిల్లీ లాంగ్ మార్చ్ ను ప్రారంభించిననేపధ్యంలోవారిని అణచి వేయడానికిపోలీసులువాటర్ క్యానన్లను ఉపయోగించారు.భారీ బారికేడ్లను,ముళ్ల కంచెలను ఏర్పాటు చేసిరైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీంతో రైతుల ఆందోళనహింసాత్మకంగా మారింది. అప్పుడు మొదలైన హింసాత్మక ఆందోళనలు గత ఏడాది కాలంగా అనేక సార్లు కొనసాగుతూ వచ్చాయి. రాజధాని ఢిల్లీలోకి రైతులను అనుమతించకుండా ఇబ్బంది పెట్టడం, రైతులను అరెస్ట్ చేయడానికి తాత్కాలిక జైళ్ళను సిద్ధం చేయడం, వెరసి ఢిల్లీ సరిహద్దులకు చట్టాల రద్దు కోసం సాగిస్తున్న రైతుల పోరాటం చేరుకుంది.

 ధర్నాలు, ర్యాలీలు, భారత్ బంద్ లు, రైల్ రోకోలు ... లాఠీ దెబ్బలు తిన్న రైతులు

ధర్నాలు, ర్యాలీలు, భారత్ బంద్ లు, రైల్ రోకోలు ... లాఠీ దెబ్బలు తిన్న రైతులు

ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులు ప్రణాళికాబద్దంగా ఆందోళన కొనసాగించారు. కిసాన్ సంయుక్త మొర్చాగా ఏర్పడి ఆందోళన పంధాను కొనసాగించారు. రైతులు ఆందోళనలో భాగంగా అనేకమార్లు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. వినూత్న నిరసనలు తెలియజేశారు.రవాణాను దిగ్బంధించారు. రైల్వే ట్రాక్ లపై టెంట్లు వేసి రైళ్లను నిలిపివేశారు.లాఠీ దెబ్బలకు కూడా భయపడకుండా రైతన్నలు పోరాటం సాగించారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ రైతన్నలు సాగించిన పోరాటానికి దేశ విదేశాల నుంచి విశేషంగా మద్దతు లభించింది. ఏకంగా లండన్లో ఇండియాలోని రైతుల పోరాటానికి మద్దతుగా ఆందోళన చేశారంటే భారతదేశంలోని రైతులు సాగించిన పోరాట ప్రస్థానం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

11 సార్లు చర్చలు జరిపిన కేంద్రం .. చర్చల సమయంలోనూ స్వాభిమానం చూపిన రైతులు

11 సార్లు చర్చలు జరిపిన కేంద్రం .. చర్చల సమయంలోనూ స్వాభిమానం చూపిన రైతులు

దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన నేపథ్యంలో రైతులతో చర్చలు జరపాలని నిర్ణయించిన కేంద్రం అనేకమార్లు చర్చలు జరిపినప్పటికీ సయోధ్య కుదరలేదు. చర్చలు విఫలమయ్యాయి. 11 సార్లు రైతులతో భేటీ అయిన ప్రభుత్వం సాగు చట్టాల రద్దుకు ససేమిరా అంది. కానీ మొదటి నుండి ఒకే మాట మీద ఉన్న రైతులు ప్రభుత్వం అనేకవిధాలుగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. తమకు నష్టం చేసి కార్పోరేట్ ల్సకు లాభం చేసే సాగు చట్టాలని రద్దు చేసి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు . పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చినా, రైతులు మాత్రం సాగు చట్టాలను రద్దు చేస్తేనే తిరిగి ఇళ్లకు వెళ్తామని తేల్చి చెప్పారు. ప్రాణాలు పోయేంత వరకు పోరాటం సాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చర్చలకు వెళ్ళిన సమయంలో కూడా పెట్టిన ప్రభుత్వం వారికి ఏర్పాటు చేసిన భోజనాన్ని నిరాకరించి తమ క్యారేజ్ లు వారే తీసుకెళ్ళి రైతన్నలు తమ స్వాభిమానాన్ని చాటుకున్నారు.

చలి, ఎండ, వానా, కరోనాను సైతం లెక్క చెయ్యని రైతుల ఉద్యమం

చలి, ఎండ, వానా, కరోనాను సైతం లెక్క చెయ్యని రైతుల ఉద్యమం

ఏడాది కాలంగా రైతన్నలు సాగిస్తున్న పోరాటంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చలికాలంలో విపరీతమైన చలిలోనూ రైతన్నలు పోరాటం సాగించారు. చలి కారణంగా ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళన చేస్తున్న రైతులు అనారోగ్యం పాలైనా, ప్రాణాలు కోల్పోతున్నా రైతన్నలు మాత్రం పోరాటం ఆపలేదు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా రైతన్నలు తమ పోరాట పంథాను వీడలేదు. కరోనాతో రైతులు చనిపోయినప్పటికీ, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దేశమంతా కరోనా లాక్డౌన్ కొనసాగించిన సమయంలోనూ ఢిల్లీ సరిహద్దులలోని పోరాటం సాగించారు. ఏకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు టెంట్లు తీసివేసి కాంక్రీటు నిర్మాణాలు చేశారంటే సాగు చట్టాల రద్దుకు రైతుల దృఢసంకల్పం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

హింసా కాండలతో రైతుల ఉద్యమానికి ఇబ్బంది, కిసాన్ మహా పంచాయత్ లతో ఉద్యమ విస్తృతి

హింసా కాండలతో రైతుల ఉద్యమానికి ఇబ్బంది, కిసాన్ మహా పంచాయత్ లతో ఉద్యమ విస్తృతి


ఏడాదికాలంగా సాగిన రైతన్నల ఉద్యమ ప్రస్థానంలో జనవరి 26 రిపబ్లిక్ డే కిసాన్ పరేడ్ లో ట్రాక్టర్స్ ర్యాలీలో చోటు చేసుకున్న హింసాకాండ, లఖింపూర్ ఖేరీ హింసాకాండ అత్యంత విషాదకరమైన ఘటనలుగా చెప్పవచ్చు. ఢిల్లీ సరిహద్దుల్లో, ఢిల్లీ కేంద్రంగా సాగిస్తున్న ఆందోళనలను దేశవ్యాప్తంగా విస్తరించడం కోసం కిసాన్ మహా పంచాయత్ లు ప్రారంభించిన రైతులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతుల మద్దతును కూడగడుతూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుండి ప్రభుత్వాలు రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపాయి. రైతుల పోరాటానికి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ రైతుల పక్షాన నిలిచి పోరాటం సాగించింది.

 రైతుల ఉద్యమం తాజా పరిస్థితి ... సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

రైతుల ఉద్యమం తాజా పరిస్థితి ... సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

పార్లమెంటు సమావేశాల సమయంలో సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టింది. అధికార బీజేపీపై ఒత్తిడి తెచ్చింది. ఒక పక్క ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం సాగిస్తూనే రైతులు న్యాయ పోరాటానికి దిగారు. మూడుసార్లు చట్టాలను రద్దు చేయాల్సిందేనని, ఆ విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని రైతులు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. సుప్రీం కోర్టులో కూడా రైతుల ఉద్యమానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఈ నేపధ్యంలో తాజాగా రహదారులను మూసివేయటంపై కోర్టులో జరిగిన విచారణ తర్వాత రైతులను సరిహద్దుల నుండి పంపించే ప్రయత్నాలు చేశారు. అయితే రైతులను బలవంతంగా సరిహద్దుల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్ లుగా మారుస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక మరోమారు ఉద్యమాన్ని విస్తృతంగా కొనసాగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన రైతులు నవంబరు 29వ తేదీ నుండి ప్రతి రోజు పార్లమెంటుకు ట్రాక్టర్ల మార్చ్ నిర్వహించాలని ఆందోళనను ఉధృతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఫైనల్ గా కేంద్రం సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకుంది.

English summary
In the capital Delhi, farmers protest to repeal the three agricultural laws brought by the Center on the borders of Delhi paid off. Finally the center came down. The reign of the farmers protest, which has been going on since November 26, is inspiring.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X