కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ
మానవాళి మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతోన్న ప్రస్తుత తరుణం.. వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రమాదం ఇంకా తొలగిపోలేదని గుర్తుచేస్తున్నదని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాతావరణంలో విపరీత మార్పులను అడ్డుకోవాలన్నా, కర్బన ఉద్గారాలు తగ్గేలా క్లీన్ ఎనర్జీని పెంపొందించాలన్నా అందుకు పటిష్ట చర్యలు, దీర్ఘకాలిక ప్రణాలికలు అవసరమని వక్కాణించారు. భూతాపం పెంచుతున్న వాతావరణ మార్పులను అరికట్టే దిశగా అమెరికా నేతృత్వంలో జరుగుతోన్న క్లైమెట్ సమ్మిట్ ను ఉద్దేశించి గురువారం ఆయన కీలక ప్రసంగం చేశారు. అంతేకాదు,
Recommended Video
పర్యావరణ హితం కోసం అమెరికా, భారత్ 'ఇండియా-యూఎస్ క్లైమెట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్టనర్షిప్' పేరిట నూతన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశాలను ప్రారంభించారు. భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

క్లైమెట్ చేంజ్ ను అడ్డుకోడానికి పటిష్ట చర్యలు అవసరమని, జీవన విధానంలో చేయాల్సిన మార్పులకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందని, విస్తృతస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అమిత వేగంతో ఈ చర్యలు చేపట్టాలని సూచించిన ప్రధాని మోదీ.. ఆ దిశగా భారత్ తన బాధ్యత నిర్వహిస్తోందని, 2030 కల్లా 450 గీగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని స్థాపించాలని భారత్ టార్గెట్ పెట్టుకుందని వివరించారు.

వాతావరణంలో ప్రతికూల మార్పులను అడ్డుకునే దిశగా భారత్ చేస్తోన్న ప్రయత్నాలకు ఎన్నో సవాళ్లు ఎదురైన్నప్పటికీ.. పర్యావరణ హిత ఇంధన రంగం, అడవుల పెంపకం, జీవవైవిధ్యత వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, పర్యావరణ రక్షణ కోసమే అమెరికా, భారత్ 'ఇండియా-యూఎస్ క్లైమెట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్టనర్షిప్' పేరిట ఓ కొత్త భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పుతున్నామని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణం పట్ల బాధ్యతాయుత వైఖరి కలిగిన భారత్ సుస్థిర అభివృద్ధి సాధించేందుకు సలహాలు , సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని, ఖరీదైన హరిత సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని, అందులో భాగంగానే భారత్, అమెరికా ఈ నూతన భాగస్వామ్యాన్ని నెలకొల్పాయని, లక్ష్యం చేరుకునేందుకు అవసరమైన నిధులు, సాంకేతికత, భాగస్వామ్యాలను రెండు దేశాలు కలిసి సాధిస్తాయని ప్రధాని మోదీ దీమా వ్యక్తం చేశారు. సమావేశంలో తొలుత ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..అమెరికా గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 2030 నాటికల్లా 50 నుంచి 52 మేర కోత విధిస్తామని ప్రకటించారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications