పహల్గాం దాడిపై 3 రోజుల ముందే మోడీకి సమాచారం ? టూర్ రద్దుపై కాంగ్రెస్ ఛీఫ్ షాకింగ్..!

కశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన తీవ్రవాద దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల్ని ఇంకా పట్టుకోలేదు. అయినా ఈ దాడికి మద్దతిచ్చిన పాకిస్తాన్ పై ప్రతీకార దాడికి కేంద్రం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడిపై ప్రధాని నరేంద్ర మోడీకి మూడు రోజుల ముందే సమాచారం ఉందని ఆయన వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి జరగవచ్చనే నిఘా వర్గాల నివేదిక ప్రధాని మోడీకి మూడు రోజుల ముందే అందిందని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. అందుకే ఆ తర్వాత మోడీ కశ్మీర్ కు తన పర్యటనను రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. పహల్గాం దాడికి నిఘా వైఫల్యం ఉందని ఖర్గే తెలిపారు. ప్రభుత్వం దానిని ఇప్పటికే అఖిలపక్ష భేటీలో అంగీకరించిందన్నారు. కేంద్రానికి పహల్గాం దాడి జరుగుతుందని ముందుగా తెలిస్తే వారు ఎందుకు ఏమీ చేయలేదని ఖర్గే ప్రశ్నించారు.

pm modi cancel kashmir tour in wake of intel report on pahalgam attack says congress chief kharge

పహల్గాం దాడి తర్వాత నిఘా వ్యవస్థను మెరుగుపరుస్తామని కేంద్రం చెప్పిందని ఖర్గే తెలిపారు. కానీ దాడిపై ముందస్తు సమాచారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 24న జరిగిన అఖిలపక్ష భేటీలో పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో భద్రతా లోపాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని విపక్షాలు తెలిపాయి. వీటిపై స్పందించిన కేంద్రం.. బైసారన్ మైదానాన్ని తెరవడానికి ముందు స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వలేదని చెప్పినట్లు తెలుస్తోంది.

గత నెలలో ోపహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి కొన్ని రోజుల ముందు పర్యాటకులను, ముఖ్యంగా జబర్వాన్ శ్రేణి దిగువన ఉన్న శ్రీనగర్ శివార్లలోని హోటళ్లలో బస చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు గుర్తించాయని ఇప్పటికే పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే మల్లిఖార్జున ఖర్గే కేంద్రాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+