గంగాతీరాన చీపురు పట్టిన బాలీవుడ్ సింగర్, ప్రధాని ప్రశంస
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కైలాష్ పవిత్ర గంగానది ఒడ్డున అతను చీపురు పట్టి శుభ్రం చేశారు.
కైలాష్ ఖేర్ స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పాల్గొనడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన పైన ప్రశంసలు కురిపించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో, అదీ వారణాసిలో పాల్గొన్నందుకు కైలాష్ ఖేర్‌ను అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇది ప్రశంసనీయమైనదన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన.. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సినీ తారలు, క్రికెటర్లు, వాణిజ్య రంగ దిగ్గజాలు చీపురు పట్టారు. 2019 వరకు గాంధీజీ కలగన్న క్లీన్ ఇండియాను సాధ్యం చేయాలని మోడీ భావిస్తున్నారు.
Bravo @kailashkher! I congratulate you for joining Swachh Bharat Mission in Varanasi. Admirable effort. https://t.co/SbqweeAO2t
— Narendra Modi (@narendramodi) December 23, 2014 

Click it and Unblock the Notifications