PM Modi: భారత్, మోదీ మీద విషం కక్కిన చైనా, దలైలామా బర్త్ డే శుభాకాంక్షలు చెప్పినందుకు !
బెంగళూరు: భారత్ మీద, భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద మరోసారి చైనా విషం కక్కింది. టిబెట్ ధార్మిక గురువు దలైలామాకు 87వ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా టిబెట్ ధార్మిక గురువు దలైలామాకు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఇదే సమయంలో దలైలామా జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. గత ఏడాది కూడా ప్రధాని నరేంద్ర మోదీ టిబెట్ ధార్మిక గురువు దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. టిబెల్ ధార్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం చైనా జీర్ణించుకోలేకపోయింది.

దలైలామా చైనా వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని, అలాంటి వ్యక్తికి భారత్ మద్దతు ఇస్తోందని చైనా విదేశాంగ సచివాలయం అధికార ప్రతినిధి లిజ్జన్ మీడియా ముందు ఆరోపించారు. ఇదే సమయంలో దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మీద చైనా సచివాలయం అధికార ప్రతినిధి లిజ్జన్ మండిపడ్డారు. భారతకు దలైలామా ఓ బంధువు అని చైనా ఎద్దేవ చేసింది.
దలైలామా రాజకీయాం చివరిదశలో ఉంది, ఆయన జీవితాంతం చైనా మీద పోరాటం చేసి ఏమీ సాధించలేకపోయారని లిజ్జన్ ఆరోపించారు. చైనా ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ గట్టిగానే బదులిచ్చింది. దలైలామా ధార్మిక గురువు, అందుకే ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినశుభాకాంక్షలు చెప్పారని, దానిని రాజకీయం చెయ్యకూడదని భారతవిదేశాంగ కార్యాలయం వివరించింది. ఇక దలైలామా, ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహాయంలో చైనా వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications