ఇజ్రాయెల్-ఇరాన్ వార్ పై మా స్టాండ్ ఇదే- నెతన్యాహుకు తేల్చేసిన మోడీ..!
ఇరాన్ అణ్వస్తాలు తయారు చేయకుండా ఆంక్షలతో బెదిరించేందుకు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ తో అమెరికా చర్చలు విఫలం కావడంతో ఆ దేశ సూచన మేరకు ఇజ్రాయెల్ దాడులకు దిగడం, దీనికి ప్రతిస్పందన కూడా రావడంతో మరో యుద్దం అనివార్యమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు భారత ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చేశారు.
ఇరాన్ పై నిన్న రాత్రి దాడులకు దిగిన ఇజ్రాయెల్ ఇద్దరు అణు శాస్త్రవేత్తలతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతిని కూడా హతమార్చింది. దీనికి ప్రతిస్పందనగా ఇవాళ ఉదయం ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో ఇజ్రాయెల్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూహు.. సాయంత్రం ప్రధాని మోడీకి కాల్ చేశారు. ఇరాన్ తో యుద్దానికి దారి తీసిన పరిస్ధితుల్ని మోడీకి ఆయన వివరించారు.

Received a phone call from PM @netanyahu of Israel. He briefed me on the evolving situation. I shared India's concerns and emphasized the need for early restoration of peace and stability in the region.
— Narendra Modi (@narendramodi) June 13, 2025
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం పై భారత్ స్టాండ్ ఏంటో నెతన్యాహుకు చెప్పేశారు. అనంతరం ఓ ట్వీట్ కూడా చేశారు. ఇందులో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహునుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని మోడీ తెలిపారు. ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి తనకు వివరించారన్నారు. భారతదేశం యొక్క ఆందోళనలను తాను ఆయనతో పంచుకున్నానన్నారు. అలాగే ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పానని వెల్లడించారు. తద్వారా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తక్షణం ఆపాలని ఆయన పరోక్షంగా సూచించినట్లయింది.












Click it and Unblock the Notifications