పంజాబ్ లో కీలక నేతలు: నేడు ప్రియాంక- అమిత్ షా : రేపటి నుంచి ప్రధాని ప్రచారం..!!

అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయం కీలక ఘట్టానికి చేరింది. మరి కొద్ది గంటల్లో ఉత్తర ప్రదేశ్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభం కానుంది. అదే విధంగా ఉత్తరాఖండ్..గోవాలో ఒకే విడతలో జరిగే ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్దం అయింది. దీంతో..ఈ నెల 20న జరగే పంజాబ్ ఎన్నికల పైన ప్రధాన జాతీయ పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పంజాబ్‌లో పర్యటించనున్నారు. ప్రధాని సోమవారం నుంచి ప్రచారం నిర్వహించే ప్రాంతాల్లోనే ప్రియాంక పర్యటిస్తున్నారు.

ఎన్నికల ర్యాలీలో ప్రియాంక

ఎన్నికల ర్యాలీలో ప్రియాంక

కోట్కాపురాలో ఈ రోజు ప్రియాంక ర్యాలీలో పాల్గొంటారు. కొట్కాపురలో ఇప్పటివరకు 12 అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, అందులో 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, 4 సార్లు ఎస్ఎడి అభ్యర్థులు విజయం సాధించారు. కొట్కాపుర కాంగ్రెస్‌కు కంచుకోటగా పరిగణిస్తారు. చివరిసారిగా 2007లో ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. ఇక, బీజేపీ అభ్యర్ధులకు మద్దతు హోం మంత్రి అమిత్ షా సైతం ఈరోజున పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం పంజాబ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి గతంలో చేదు అనుభం ఎదురైన నేపథ్యంలో అమిత్ షా పర్యటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

అమిత్ షా సుడిగాలి పర్యటన2

అమిత్ షా సుడిగాలి పర్యటన2

లూథియానా, పాటియాలా బహిరంగ సభల అనంతరం అమిత్ షా.. అమృత్‌సర్‌లో పర్యటించనున్నారు. సాయంత్రం 5:15 అమత్‌సర్‌ చేరుకుని వాల్మీకి మందిర్‌లో పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత దుర్గియానా మందిర్‌లో సాయంత్రం 7 గంటలకు ప్రార్థనల్లో పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ నేతలు వెల్లడించారు. రేపటి నుంచి ప్రధాని మోదీ మూడు రోజుల పాటు పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మాల్వా, దోబా, మాజా మూడు ప్రాంతాలలో మూడు బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 14న జలంధర్‌లో మొదటి ర్యాలీ, ఫిబ్రవరి 16న పఠాన్‌కోట్‌లో రెండో ర్యాలీ, 17న అబోహర్‌లో మూడో ర్యాలీలో ఆయన ప్రసంగిస్తారు. ఈ రోజు అమిత్ షా.. రేపు ప్రధాని పర్యటన ద్వారా బీజేపీ అభ్యర్ధుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Recommended Video

    UP Elections 2022:PM Modi రిక్వెస్ట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు | Yogi Adityanath | Oneindia Telugu
    మూడు రోజుల పాటు ప్రధాని ప్రచారం

    మూడు రోజుల పాటు ప్రధాని ప్రచారం

    ఉత్తరాఖండ్ లో ఎన్నికల ప్రచారం ముగిసే ముందు ప్రియాంక ఖతిమాలో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ కూడా ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కాంగ్రెస్ కారణమంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై రియాక్ట్ అయ్యారు. ప్రధాని వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఇక, పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తిరిగి తమ అధికారం కొనసాగే విధంగా సామాజిక సమీకరణాలను అమలు చేస్తూ..ఓట్ బ్యాంకు పైన ఆశలు పెట్టుకుంది. అయితే, బీజేపీ మాత్రం ఈ సారి పంజాబ్ ప్రజలు తమ వైపే నిలుస్తారని చెబుతోంది. ఇక, ఆప్ సైతం పంజాబ్ లో తమ సత్తా నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక, ప్రచార హోరులో మాటల తూటాలు.. విమర్శలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+