హమ్మయ్య-ఆప్ నుంచి ఢిల్లీకి విముక్తి కల్పించాం-ప్రధాని కామెంట్స్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయంపై ప్రధాని మోడీ ఇవాళ సంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత గెలిచిన బీజేపీ ప్రస్తుతం సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొన్న ప్రధాని.. కీలక ప్రసంగం చేసారు. ఇందులో ఢిల్లీని ఆప్ కబంద హస్తాల నుంచి విముక్తి కల్పించడం సంతోషంగా ఉందని తెలిపారు.

PM modi express satisfaction over freeing delhi from aap key speech in bjp head quarters

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ బీజేపీ సాధించిన ఘనవిజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య బీజేపీ ఆఫీసులో పోడియం వరకు మోడీ నడిచారు. అనంతరం చేసిన ప్రసంగంలో రెట్టింపు వేగంతో అభివృద్ధిని అందించడం ద్వారా దేశ రాజధాని ప్రజల రుణం తీర్చుకుంటానని మోడీ వెల్లడించారు. ఢిల్లీ మనకు మనస్పూర్తిగా ప్రేమను అందించిందని, అభివృద్ధి రూపంలో మీకు రెట్టింపు ప్రేమను తిరిగి అందజేస్తామని ప్రజలకు మరోసారి హామీ ఇస్తున్నానని తెలిపారు.

ప్రజల ప్రేమ, నమ్మకాన్ని తన ప్రభుత్వానికి రుణం అని ప్రధాని మోడీ తెలిపారు. తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఢిల్లీకి రెట్టింపు వేగంతో అభివృద్ధిని అందిస్తుందన్నారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా నగరాన్ని ఆప్ రహితంగా మార్చారని ప్రధాని అభివర్ణించారు. ఢిల్లీలో కమలం వికసించని ప్రాంతం లేదని, ప్రతి భాష మాట్లాడే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల సమయంలో తాను ఎక్కడికి వెళ్లినా పూర్వాంచల్‌ నుంచి ఎంపీని అని గొప్పగా చెప్పుకునేవారన్నారు. పూర్వాంచల్ ప్రజలు ఈ బంధానికి ప్రేమను అందించారన్నారరు. అందుకే పూర్వాంచల్ ఎంపీగా పూర్వాంచల్ ప్రజలకు కృతజ్ఞతలని తెలిపారు. ఢిల్లీ ప్రజలు షార్ట్ కట్ రాజకీయాన్ని షార్ట్ సర్క్యూట్ చేసేశారని ఆప్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీకి నిజమైన యజమాని ఢిల్లీ ప్రజలు మాత్రమే అని వారు స్పష్టం చేశారన్నారు. ఢిల్లీకి యజమానులుగా భావించిన వారికి నిజాలు ఎదురయ్యాయని, రాజకీయాల్లో షార్ట్‌కట్‌లకు, అబద్ధాలకు తావు లేదని ఢిల్లీ ఫలితాన్ని బట్టి కూడా స్పష్టమవుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+