Vande Bharat Sleeper: పట్టాలెక్కిన తొలి వందేభారత్ స్లీపర్-ఛార్జీలు, ఫీచర్లు ఇవే..!
భారత్ లో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఇవాళ ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. హౌరా-కామాఖ్య మార్గంలో దీన్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే ఈ ప్రీమియం రైలుకు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను, ఫొటోలను రైల్వే శాఖ షేర్ చేసింది. ఇప్పటికే పరుగులు తీస్తున్న వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో స్లీపర్ రైళ్ల రాక రైల్వే రూపురేఖల్ని పూర్తిగా మార్చబోతోంది.
ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమ బెంగాల్ లోని మాల్దా టౌన్ నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు నంబర్ 27575 హౌరా నుంచి కామాఖ్య వరకూ ప్రయాణించబోతోంది. హౌరాలో సాయంత్రం 6:20కు బయలుదేరి కామాఖ్య కు రేపు ఉదయం 08:20కు ఇది చేరుకోనుంది. ఇందులో మొత్తం 823 మంది ప్రయాణించే అవకాశం ఉంది. రైలులో మొత్తం 16 ఏసీ కోచ్‌లు ఉన్నాయి. వీటిలో 11 ధర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, మరొక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి.

#WATCH | Malda, West Bengal: PM Narendra Modi flags off India’s first Vande Bharat Sleeper Train between Howrah and Guwahati (Kamakhya)
— ANI (@ANI) January 17, 2026
(Source: DD) pic.twitter.com/lQkE5g6gCa
ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. రెగ్యులర్ గా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించబోతోంది. ఈ రైలును వారానికి 6 రోజుల పాటు నడపబోతున్నారు. హౌరా నుంచి గురువారాల్లో, కామాఖ్య నుంచి బుధవారాల్లో ఈ రైలు ప్రయాణించనుంది. అలాగే న్యూ జల్పాయ్ గురితో సహా 13 స్టాప్‌లు ఇచ్చారు. ప్రతీ స్టాప్ లోనూ 10 నిమిషాల హాల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణికుల స్పందన, ఇతర అంశాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తారు. హౌరా నుంచి కామాఖ్యకు వందే భారత్ స్లీపర్ రైలులో ధర్డ్ ఏసీ ఛార్జీ 2299గా నిర్ణయించారు. అలాగే న్యూజల్పాయ్ గురికి 1334, మాల్దాకు 960గా నిర్ణయించారు. అలాగే ఏసీ టూటైర్ లో కామాఖ్యకు 2970, న్యూజల్పాయ్ గురికి 1724, మాల్దాకు 1240 వసూలు చేస్తారు. ఫస్ట్ ఏసీలో కామాఖ్యకు 3640, న్యూజల్పాయ్ గురికి 2113, మాల్దాకు 1520 వసూలు చేస్తున్నారు.

VIDEO | Malda, West Bengal: Prime Minister Narendra Modi (@narendramodi) interacts with children onboard the Vande Bharat Sleeper Class train and will shortly flag off India’s first Vande Bharat Sleeper Train between Howrah and Guwahati (Kamakhya) from Malda Town Railway Station.… pic.twitter.com/ZunXNDJvgk
— Press Trust of India (@PTI_News) January 17, 2026
ఇవాళ తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ విద్యార్దులతో కలిసి ఈ రైలులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధుల అనుభవాల్ని అడిగి తెలుసుకున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఇప్పుడు తీసుకొచ్చిన స్లీపర్ రైలుపై విద్యార్ధులు సంతోషంగా ప్రధాని మోడీకి తమ అనుభవాలు వివరించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications