PM Modi: మోడీకి నెతన్యాహు పర్సనల్ థ్యాంక్స్..! అందుకే..!

ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి. దీంతో ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లపై దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపై భారత్ ఇప్పటివరకూ స్పందించలేదు. మరోవైపు గల్ఫ్ దేశాధినేతలకు ఫోన్లు చేస్తున్న ప్రధాని మోడీ (pm modi) ఆయా దేశాల్లోని భారతీయుల భద్రత మీద ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇవాళ మోడీకి ఫోన్ చేశారు.

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో "చాలా సేపు" మాట్లాడానని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్‌పై పోరాటంలో "ఇజ్రాయెల్‌కు మద్దతుగా, యూదులకు మద్దతుగా నిలిచినందుకు నెతన్యాహు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు పశ్చిమాసియాలో తాజా పరిస్థితి గురించి ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడానని, తాజా పరిణామాలపై భారత్ ఆందోళనలను తెలియజేశానని, పౌరులను రక్షించడం గురించి చర్చించనట్లు ప్రధాని మోడీ ఇప్పటికే ఎక్స్ లో వెల్లడించారు.

PM Modi Gets Personal Thanks from Netanyahu for Standing with Israel

అటు ఇరాన్ లోనూ భారత పౌరుల పరిస్ధితి దారుణంగా ఉంది. అయితే భారత్ ఇప్పటివరకూ దీనిపై స్పందించలేదు. కేవలం సూచనలు మాత్రమే జారీ చేస్తోంది. ట్రంప్ కు కోపం వస్తుందనే ఇలా ఇరాన్ విషయంలో భారత్ స్పందించడం లేదన్న చర్చ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానితో మన ప్రధాని మోడీ ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే చిరకాల మిత్రదేశం ఇరాన్ ను కాదని ఇజ్రాయెల్ వైపు కేంద్రం మొగ్గు చూపడంపై భారత్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. కేంద్రం మాత్రం దీనిపై స్పందించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+