32 ఏళ్ల నాడే మోదీ శపథం, మందిరం నిర్మించే అయోధ్యకు - నేడు సాకారం..!!

అయోధ్యలో నేడే రాముడు కొలువు తీరనున్నాడు. కోట్లాది మంది దశాబ్దాల కల సాకారం అవుతోంది. దేశం మొత్తం రామ నామంతో పులకరిస్తోంది. జగనమంతా రామోత్సవం జరుపుకుంటోంది. జాతీయ, అంతర్జాతీ య ప్రముఖులు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి తరలి వస్తున్నారు. ఈ రామాలయం వెనుక ప్రధాని మోదీ 32 ఏళ్ల నాటి శపథం ఉంది. అయోధ్యలో రామాలయం నిర్మించే తిరిగి అయోధ్యకు వస్తానని ప్రతిజ్ఞ చేశారు. నేడు అదే మోదీ రామాలయం ప్రారంభిస్తున్నారు.

అందరి చూపు అటే: అయోధ్య రామాలయం. కోట్లాది మంది ఆకాంక్ష. సుదీర్ఘ పోరాటం..న్యాయ వివాదాల తరువాత ఈ రోజు అయోధ్యలో రామాలయం ప్రారంభం అవుతోంది. సుప్రీం న్యాయ పరిష్కారంతో అయోధ్యలో రామ మందిరం ఈ రోజు ఆరంభం కానుంది. కానీ, దీని వెనుక అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

PM Modi had taken a vow on this day 32 years ago in Ram Janmabhoomi, see the details

ప్రధాని మోదీ అయోధ్య రామాలయ నిర్మాణం ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 32 ఏళ్ల క్రితమే ప్రధాని మోదీ ఒక శపథం చేసారు. అయోధ్యలో రామాలయం నిర్మించిన తరువాతనే తిరిగి అయోధ్యకు వస్తానని ప్రతిజ్ఞ బూనారు. ఇప్పుడు అది నిజమైంది. నేడు కోట్లాది మంది ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరం ఆవిష్కరిస్తున్నారు.

మోదీ నాటి ప్రతిజ్ఞ: నాడు రామజన్మభూమిలో మోదీ పర్యటన..అక్కడ పరిస్థితుల్లో చేసిన ప్రతిజ్ఞ ..నాటి ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 32 ఏళ్ల క్రితం నాడు మోదీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. రామ మందిరం గురించిన సందేశాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేయడానికి ఆ యాత్ర నిర్వహించారు. ఆ సమయంలోనే అయోధ్యకు చేరుకున్నారు.

రామజన్మభూమి ప్రాంతంలో పర్యటనకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న పరిస్థితుల పైన స్పందించారు. 'జై శ్రీరామ్' నినాదాల మధ్య, నరేంద్ర మోడీ ఒక ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడే తిరిగి వస్తానన్నారు. అది నిజమైంది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత అయోధ్యలో రామాలయం కోసం ప్రధాని హోదీలో మోదీనే 202, ఆగస్టు 5న భూమి పూజ చేసారు.

PM Modi had taken a vow on this day 32 years ago in Ram Janmabhoomi, see the details

బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ: తిరిగి ఇప్పుడు మోదీ ప్రభుత్వంలోనే శతాబ్దాల కలగా ఉన్న అయోధ్యలో శ్రీరాముడి భవ్య మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైంది. రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. అందరి చూపు అయోధ్య వైపే అన్నట్లుగా మారింది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ప్రధాని మోదీ 11 రోజుల దీక్ష నిర్వహించారు.

దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను సందర్శించారు. అయోధ్యకు వివిధ రాష్ట్రాల నుంచి విలువైన వస్తువులు అయోధ్యకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా గుజరాత్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ నుంచి దీపాలు, ధూపం బత్తీలు అయోధ్య నగరానికి చేరకున్నాయి. ఈ మధ్నాహ్నం అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా చూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+