వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

71వేల మంది కొత్త ఉద్యోగులకు అపాయింట్‌ లెటర్లు అందించిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రోజ్‌గార్ మేళాలో భాగంగా నూతనంగా ఉద్యోగాలు పొందిన 71వేల మందికి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఉపాధి కల్పనను పెంపొందించడం, వారి సాధికారత, జాతీయ అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనడం కోసం యువతకు అర్ధవంతమైన అవకాశాలను అందించడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ మినహా దేశంలోని 45 ప్రదేశాలలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కొత్త నియామకాలకు సంబంధించిన నియామక లేఖల భౌతిక కాపీలు అందజేయడం జరిగింది.

PM Modi handed over job-offer letters to 71,000 freshers in Rozgar Mela

ఈ సందర్భంగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు అయిన కర్మయోగి ప్రారంభం మాడ్యూల్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు.

"మాడ్యూల్‌లో ప్రభుత్వోద్యోగుల ప్రవర్తనా నియమావళి, కార్యాలయ నీతి, సమగ్రత, మానవ వనరుల విధానాలు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు ఉంటాయి, ఇవి విధానాలకు అలవాటు పడటానికి, కొత్త పాత్రలలోకి సజావుగా మారడానికి సహాయపడతాయి' అని పీఎంవో
పేర్కొంది.

అంతకుముందు అక్టోబర్‌లో రోజ్‌గార్ మేళా కింద కొత్తగా చేరిన 75,000 మందికి నియామక పత్రాలు కూడా అందజేశారు ప్రధాని మోడీ.

ఈ కొత్త నియామకాలతో వివిధ స్థాయిలలో ప్రభుత్వంలో చేరతారు. వీటిలో గ్రూప్-ఏ, గ్రూప్-బీ (గెజిటెడ్), గ్రూప్-బీ (నాన్-గెజిటెడ్), గ్రూప్-సీ భారత ప్రభుత్వ 38 వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన ఈ కొత్త రిక్రూట్‌లు, మిషన్ మోడ్‌లో మంజూరైన పోస్టులకు గానూ ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు పని చేయాలని ప్రధానమంత్రి ఆదేశాలు ఉన్నాయి.

ఈ రిక్రూట్‌మెంట్‌లు మినిస్ట్రీలు, డిపార్ట్‌మెంట్‌లు స్వయంగా లేదా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వంటి రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా మిషన్ మోడ్‌లో జరుగుతాయి. త్వరితగతిన రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక ప్రక్రియలు సరళీకృతం చేయబడ్డాయి. టెక్-ఎనేబుల్ చేయబడ్డాయి.

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ పర్సనల్, సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, టీచర్లు, లెక్చరర్లు, నర్సులు, డాక్టర్లు, ఫార్మాసిస్ట్‌లు వంటి ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయి. వివిధ కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో (సీఏపీఎఫ్) గణనీయమైన సంఖ్యలో పోస్టులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భర్తీ చేస్తోంది.

English summary
PM Modi handed over job-offer letters to 71,000 freshers in Rozgar Mela.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X