వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత కారు లేదు, చేతిలో రూ.50వేలు కూడా లేవు!: మోడీ ఆస్తులెంతో తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పేద కుటుంబంలో జన్మించి, ఛాయ్ వాలాగా జీవితం ప్రారంభించిన నరేంద్ర దామోదర్ దాస్ మోడీ(నరేంద్ర మోడీ) ప్రధానమంత్రిగా ఎదిగారు. కేంద్రంలో అధికారం చేపట్టి ఇటీవలే నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, నాలుగేళ్లుగా ప్రధానిగా ఎలాంటి అవినీతి మచ్చలేకుండా ఆయన పాలన కొనసాగించడం గమనార్హం.

మోడీ చేతిలో రూ.50వేలు కూడా లేవు..

మోడీ చేతిలో రూ.50వేలు కూడా లేవు..

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల వివరాలను కేంద్రం ప్రభుత్వం వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మార్చి 31, 2018 నాటికి ప్రధాని మోడీ చేతిలో ఉన్న డబ్బు రూ.48,944లే కావడం గమనార్హం. ఇక ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 2.28కోట్లు. ఇందులో రూ. 1.28కోట్లు చరాస్తులు.

నేనైతే రూ.35-రూ.45కు ఇస్తా: పెట్రోల్ ధరలపై మోడీకి రాందేవ్ బాబా వార్నింగ్ నేనైతే రూ.35-రూ.45కు ఇస్తా: పెట్రోల్ ధరలపై మోడీకి రాందేవ్ బాబా వార్నింగ్

కోటి విలువైన నివాస స్థలం

కోటి విలువైన నివాస స్థలం

కాగా, గాంధీనగర్‌లో మోడీ నివాస స్థలం విలువ రూ. కోటి. దాదాపు 900 చదరపు అడుగుల నివాస స్థలాన్ని 2002లో ఆ స్థలాన్ని మోడీ రూ. లక్షకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ స్థలం విలువ రూ. కోటికి పెరిగింది.

బ్యాంకులో ఆస్తులు ఇవి..

బ్యాంకులో ఆస్తులు ఇవి..


ఇక గాంధీనగర్‌లోని ఎస్బీఐ బ్యాంక్ శాఖలో ప్రధాని మోడీకి ఖాతా ఉంది. మార్చి 31 నాటికి అందులో రూ.11,29,690 నిల్వ ఉన్నాయి. అదే బ్రాంచీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీంల రూపంలో మోడీ పేరుపై రూ.1.07కోట్ల పెట్టుబడులున్నాయి.

సొంత కారు కూడా లేదు..

సొంత కారు కూడా లేదు..

అంతేగాక, రూ.5.18లక్షల విలువ గల జాతీయ పొదుపు బాండ్, రూ.1.59లక్షల విలువ గల జీవిత బీమా పాలసీ ఉంది. కాగా, మోడీ పేరుపై కనీసం సొంత కారు కూడా లేకపోవడం గమనార్హం. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఆయన వద్ద రూ.1.38లక్షల విలువ గల నాలుగు బంగారు ఉంగరాలు మాత్రం ఉన్నాయి.

English summary
After exhorting millions of Indians to use digital modes of payment, Prime Minister Narendra Modi, it seems, is doing his best to make India a less-cash economy. PM Modi's cash-in-hand dropped by a whopping 67 per cent to Rs 48,944 as of March 31 this year from around Rs 1,50,000 in the previous year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X