ఆపరేషన్ సిందూర్..మారుతున్న భారతదేశ ముఖచిత్రం మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ!

దేశం మాత్రమే కాదు ప్రపంచమంతా ఆపరేషన్ సిందూర్ గురించి ఆసక్తిగా చూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదాన్నిఅంతం చేయడం దేశంలోని ప్రతిపౌరుడి సంకల్పమని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం సంఘటితమైందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వసం చేయడలో అద్భుతమైన పరాక్రమం ప్రదర్శించి దేశాన్ని ఉన్నతంగా నిలిపిందన్నారు.

ఆపరేషన్ సిందూర్ సైనిక మిషన్ కాదు: పీఎం మోదీ
ఉగ్రవాద వ్యతిరేక పోరాటంగా మనం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్తంగా కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం ఒక సైనిక మిషన్ కాదని, అది మన సంకల్పం, ధైర్యానికి ప్రతీక అని, మారుతున్న భారత దేశ ముఖచిత్రమని ప్రధాన మంత్రి అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయంతో దేశమంతటా భక్తిభావం నింపిందని, జాతీయజెండాలతో సైన్యానికి అభినందనలు తెలియచేయడానికి పల్లెల నుంచి మహానగరాల వరకు కదలి వచ్చాయని చెప్పారు.

pm modi interesting message to nation on operation sindoor and naxal operation in mann ki baat

Take a Poll

ఆపరేషన్ సిందూర్ తో యువతలో దేశభక్తి
ఆపరేషన్ సిందూర్ విజయం ప్రజలను ఎంతో ప్రభావితం చేసిందని, సైన్యంలో వాలంటీర్లుగా చేరేందుకు ఎందరో యువకులు ముందుకు వచ్చారని అన్నారు. ఇక మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధం గురించి మాట్లాడిన ప్రధాని మోదీ మావోయిస్టుల ప్రభావంతో చాలా గ్రామాలు బస్సు సదుపాయానికి దూరంగా ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ప్రధాన మంత్రి చెప్పారు.

మావోయిస్ట్ ప్రభావిత గ్రామానికి తొలిసారిగా బస్సు
మావోయిజానికి వ్యతిరేక సామూహిక పోరాటంతో అలాంటి ప్రాంతాలకు కూడ ప్రాథమిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయంటూ, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కాటేఝరి గ్రామాన్ని ఉదహరించారు. అ ఊరికి మొదటిసారిగా చేరుకున్న బస్సుకు స్థానికులు డప్పులతో స్వాగతం పలికారని చెప్పారు. బస్సు రాకతో తమ జీవితం సుఖవంతంగా సాగుతుందని గ్రామస్తులు చెబుతున్నారని అన్నారు.

డ్రోన్ దీదీలు స్కై వారియర్స్
ఇక ప్రధాని మోదీ గ్రామీణ మహిళలు డ్రోన్ దీదీలుగా మారి వ్యవసాయంలో నూతన విప్లవాన్ని తీసుకువస్తున్నారని, తెలంగాణాలోని సంగారెడ్డి మహిళలు అందుకు నిదర్శనమని అన్నారు. సంకల్పానికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించారని అన్నారు. ఆ మహిళలు డ్రోన్ ల సహాయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో మందుల పిచికారీ పనిని నిర్వహించారు. వారు డ్రోన్ ఆపరేటర్లుగానే కాక స్కై వారియర్స్ గా గుర్తింపు పొందారని అభినందించారు.

యోగా దినోత్సవంపై ప్రధాని మోదీ
వచ్చే నెల 21న జరిగే యోగా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని యోగా జీవన విధానాన్ని మారుస్తుందని, ఇప్పటిదాకా యోగాకు దూరంగా ఉన్నవారు దానికి అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. పదేళ్ల క్రితం 2015 జూన్ 21న ప్రారంభమైన యోగా దినోత్సవం ఎంతో ఆదరణ పొందుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించిందని, విశాఖపట్నంలో జరిగే 'యోగదినోత్సవం'లో పాల్గొనే అవకాశం తమకు లభిస్తోందని ప్రధాన మంత్రి వెల్లడించారు.

ఆయుర్వేదంపై ప్రధాని మోదీ చెప్పిందిదే
యోగాతో పాటు ఆయుర్వేదాన్ని మరింత అభివృద్ధి చేయవలసి ఉందని ప్రధాని మంత్రి అన్నారు. ఈ నెల 24 న దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ తులసీభాయ్ సమక్షంలో అవగాహన పత్రాలపై సంతకాలు జిరిగాయని గుర్తు చేశారు. దీంతో ఆయుష్ ప్రపంచ వ్యాప్తంగా మరింత మందికి చేరేందుకు వీలువుతుందని అన్నారు. ఇంకా ఎన్నో ఆసక్తికర అంశాలను ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+