రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు: ప్రధాని మోడీ స్వయంగా: రేపే

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి పీఠం ఎవరిని వరిస్తుందనేది తేలిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తరపున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేసిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తోందనే విషయంపై స్పష్టత ఏర్పడింది. ఈ నెల 18వ తేదీన పోలింగ్ ముగిసిన ఈ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు తొలి రౌండ్‌ కొద్దిసేపటి కిందటే ముగిసింది. ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యతను సాధించారు.

తొలి విడతలో ఎంపీల ఓట్లను లెక్కపెట్టారు. ఈ లెక్కింపు పూర్తయింది. ఇందులో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్ల విలువ 3,78,000. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పడ్డాయి. వీటి విలువ 1,45,600. కాగా- 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీనితో పార్లమెంట్ సభ్యుల ఓట్ల కేటగిరీలో ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యాన్ని సాధించినట్టయింది. దీని తరువాత శాసన సభ్యుల ఓట్లను లెక్కింపు చేపట్టారు ఎన్నికల అధికారులు. రెండో విడతగా ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

PM Modi is hosting a farewell dinner for outgoing President Ram Nath Kovind on July 22

కాగా- ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం దాదాపుగా ఖాయమైనట్టే. దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇక లాంఛనప్రాయమే. ఈ నెల 25వ తేదీన ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం 24వ తేదీన ముగియబోతోంది. ఇంకో మూడురోజులు ఆయన రాష్ట్రపతి పదవిలో కొనసాగనున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకబోతోంది. ప్రత్యేకంగా వీడ్కోలు విందును ఏర్పాటు చేయనుంది. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలోని అశోక హోటల్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు, పలువురు అధికారులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీనికి హాజరు కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+