వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్ వార్ పై మోడీ కీలక వ్యాఖ్యలు-ప్రాంతీయ సహకారం లేకపోతే జరిగేది ఇదే !

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ యుద్ధానికి దారి తీసిన పరిణామాలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదో బిమ్ స్టెక్ సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రాంతీయ సహకారం లేకపోతే ఏం జరుగుతుందో యూరప్ లో కనిపిస్తోందనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. అందుకే ప్రాంతీయ సహకారానికి కలిసి రావాలని ఆయన బిమ్ స్టెక్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 30న ఐరోపాలో ఇటీవలి పరిణామాల దృష్ట్యా ప్రాంతీయ సహకారం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. భారతదేశం బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్‌స్టెక్) సెక్రటేరియట్ దాని కార్యాచరణ బడ్జెట్‌ను పెంచడానికి మిలియన్ డాలర్ల సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ తెలిపారు.

pm modi key comments amid russia-ukraine war, call for greater regional cooperation

ఐరోపాలో ఇటీవలి పరిణామాలు అంతర్జాతీయంగా స్థిరత్వం గురించి పలు ప్రశ్నలను లేవనెత్తాయని ప్రధాని మోడీ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్రాంతీయ స‌హ‌కారానికి ప్రాధాన్య‌త ఏర్పడిందన్నారు. ఇవాళ భారత్ బిమ్ స్టెక్ గ్రూప్ కోసం తగిన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి బిమ్స్‌టెక్ చార్టర్‌ను స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బిమ్‌స్టెక్ సెక్రటేరియట్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యమన్నారు. దీని కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని సెక్రటరీ జనరల్‌కి ప్రధాని మోడీ సూచించారు. బంగాళాఖాతం కనెక్టివిటీ, శ్రేయస్సు, భద్రతా వారధిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు 1997లో ఉమ్మడిగా సాధించిన లక్ష్యాల తరహాలోనే కొత్త వాటిని కూడా సాధించేందుకు కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి తమను తాము అంకితం చేసుకోవాలని అన్ని బిమ్‌స్టెక్ దేశాలకు మోడీ పిలుపునిచ్చారు.

English summary
pm modi on today called for greater regional cooperation in fifth bimstec summit amid russia-ukraine war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X