నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకయ్యకు ప్రధాని లేఖ - వినోబా భావేతో పోల్చుతూ : ఇదే చొరవ కొనసాగాలి..!!

|
Google Oneindia TeluguNews

ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్య నాయుడుకు ప్రధాని మోదీ లేఖ రాసారు. మూడు పేజీల సుదీర్ఘ లేఖలో అనేక అంశాలను వివరించారు. అందులో వెంకయ్య నాయుడులోని ప్రత్యేక లక్షణాలను శక్తి సామర్ధ్యాలను ప్రశంసించారు. ఆయన ప్రస్తావించారు. నెల్లూరులో సాధారణ రైతు కుటుంబం నుంచి అంచెలంచలుగా ఎదిగిన విధానాన్ని ఆయన ప్రస్తావించారు. స్పూర్తి దాయకంగా నిలిచారని అభినందించారు. సాధారణ కార్యకర్తగా మొదలై.. పార్టీ అధినేత వరకు ఎదిగిన తీరును ప్రశంసించారు.

వినోబా భావేతో పోల్చుతూ

వినోబా భావేతో పోల్చుతూ


ఎంపీగా.. కేంద్ర మంత్రిగా.. రాజ్యసభ ఛైర్మన్ గా.. ఉప రాష్ట్రపతిగా ఏ పదవి చేపట్టినా..అందులో ఆయన ప్రత్యేకత చాటుకున్నారని అభినందించారు. వెంకయ్య నాయుడుని వినోబా భావేతో ప్రధాని పోల్చారు. వినోబా రచనలు తనలో ఎంతో స్పూర్తిని నింపాయని ప్రధాని పేర్కొన్నారు. ఆయన రచనల్లో ఎక్కడా ఏ పదం అవసరమో దానిని ఖచ్చితంగా సమర్ధవంతంగా ప్రయోగించేవారని..వెంకయ్య ప్రసంగాలు వింటే తనకు అవే గుర్తుకు వస్తాయని ప్రధాని వివరించారు. పార్టీ పట్ల నిబద్దత..విశ్వాసం..అంకిత భావం సొంత రాష్ట్రంలో రాజకీయంగా పెద్దగా బలం లేకపోయినా పార్టీ పరంగా మీరే దిక్సూచీగా నిలిచారని ప్రశంసించారు.

సభాపతిగా వెంకయ్య సేవలపైనా

సభాపతిగా వెంకయ్య సేవలపైనా


కొత్తగా సభ్యులైన వారికి వెంకయ్య సభలో మాట్లాడే అవకాశం కల్పించటంతో పాటుగా వారిలోని శక్తిని బయటకు తీయటానికి ప్రయత్నం చేసారన్నారు. క్రమశిక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తావించారు. సభలో క్రమశిక్షణ తప్పినా.. వాయిదా పడినా ఆయన ఎంతో బాధ పడేవారంటూ వెంకయ్య కు రాసిన లేఖలో ప్రధాని పేర్కొన్నారు. ఆయన పెద్దల సభ పెద్దగా వ్యవహరించిన తీరు ఎప్పటికీ నిలిచిపోతుందని ప్రధాని వివరించారు. 2014 లో తన కేబినెట్ లో అర్బన్ వ్యవహారాల శాఖా మంత్రిగా వెంకయ్య దేశంలో మెట్రో నెట్ వర్క్ ను విస్తరించటంలో.. అందరికీ గృహాలను అందించడంలో 'ఈజ్ ఆఫ్ లివింగ్'ని పెంచడానికి మార్గదర్శకంగా వ్యవహరించారని ప్రశంసించారు.

Recommended Video

ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను సొమ్ము చేసుకుంటూ *Politics | Telugu OneIndia
రానున్న రోజుల్లోనూ యాక్టివ్ గా ఉండాలంటూ

రానున్న రోజుల్లోనూ యాక్టివ్ గా ఉండాలంటూ


వెంకయ్యలోని వాక్చాతుర్యం..వన్ లైనర్లు వెంకయ్య బలాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసినా.. ఇంతే యాక్టివ్ గా రానున్న కాలంలోనూ వ్యవహరించాలని ప్రధాని ఆకాంక్షించారు. దాదాపు అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను చూసిన వెంకయ్య నాయుడు..తాను ఎప్పుడూ పదవులను కోరుకోలేదని, పెద్దల అభిమానంతోనే దక్కాయని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో వెంకయ్య వీడ్కోలు కార్యక్రమంలోనూ ప్రధాని సభలో వెంకయ్య ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు.

English summary
PM Modi wrote a letter to Venkaiah Naidu, compared Naidu to Acharya Vinoba Bhave and commended his infectious energy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X