మెను ఇదే: షరిఫ్ మనవరాలి వివాహనికి మోడీకి ఆహ్వానం?

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌లో ఆకస్మిక పర్యటనకు తెరదీసి సంచలనం సృష్టించారు. ఆప్గనిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌‌కు వచ్చిన ప్రధాని మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ ఘన స్వాగతం పలికనున్నారు. శుక్రవారం లాహార్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ మనవరాలి వివాహం జరగనుంది.

మనవరాలి వివాహానికి ప్రధాని మోడీని నవాజ్ షరిఫ్ ఆహ్వానించే అవకాశం ఉంది. అంతేకాదు ఈరోజు పాకిస్థాన్‌ చరిత్రలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా జయంతి కూడా ఈరోజు కావడం విశేషం. పాకిస్థాన్‌లో ప్రధాని మోడీ 2 గంటల పాటు ఉంటారు.

లాహోర్ ఎయిర్‌పోర్టులో భారత్, పాకిస్థాన్ ప్రధానులు సమావేశమవుతారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం లాహోర్ విమానాశ్రయంలోనే నవాజ్ షరిఫ్ ఇచ్చే విందులో ప్రధాని మోడీ పాల్గొంటారు.

PM Modi to make surprise stopover in Pakistan, meet Nawaz Sharif

తనకు నేరుగా శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తోన్న భారత ప్రధాని మోడీకి అదిరిపోయేలా విందు ఇవ్వాలని పాక్ ప్రధాని షరీఫ్ నిర్ణయించారు. 35 మంది పాకశాస్త్ర నిపుణులను లాహోర్‌కు రప్పించారు. మోడీ శాకాహారి కావడంతో ఆయన కోసం పాలక్ పనీర్ ఇతర వంటకాలు సిద్ధం చేస్తున్నారు.

అదే విధంగా మిగతా అతిథుల కోసం ఫిష్ ఫ్రై కూడా తయారు చేస్తున్నారు. ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా పాక్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి పుట్టినరోజు విందు అదిరిపోవాలనే ఆలోచనలో షరీఫ్ ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రత్యేక సూచనలతో స్పెషల్ వంటకాలు చేయిస్తున్నారు.

ఈ సమావేశం అనంతరం సాయంత్రం 5.15కు భారత్‌కు తిరుగు పయనమవుతారు. ప్రధాని అయ్యాక ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌లో మోడీ పర్యటన లేదు. 12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోడీనే కావడం విశేషం.

అంతక ముందు 2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి పాకిస్థాన్‌లో పర్యటించారు. దీంతో మోడీ పాక్‌ పర్యటనకు వెళ్లడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీ పర్యటనను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పుట్టినరోజు సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఈ ఉదయం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ పాక్ గడ్డపై కాలు మోపాలనే నిర్ణయం ఈరోజే తీసుకున్నట్లు తెలుస్తోంది.

షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఈరోజు లాహోర్‌లో కలుసుకుంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీనికి పాక్ ప్రధాని సైతం అంగీకారం తెలిపి, క్షణాల్లో ఏర్పాట్లు చేశారు. మోడీ వస్తుండటంతో భద్రతా పరంగా తగిన చర్యలు తీసుకున్నారు. అయితే ప్రధాని మోడీ తనకు తానుగా ట్వీట్ చేసే వరకు కూడా లాహోర్ పర్యటన గురించి ఇరుదేశాల మీడియాకు కూడా తెలియక పోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+