వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ఆర్ధిక కష్టాలు, భారత్‌కు లాభాలు ఎలా?: మోడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో ఈరోజు ఉదయం పారిశ్రామిక దిగ్గజాలు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ప్రధాని మోడీ తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో "చైనాలో నెలకొన్న ఆర్థిక కష్టాలను ఇండియా లాభాలుగా మార్చుకోవడం ఎలా?" అని భారత పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోడీ సూటిగా ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు పారిశ్రామిక దిగ్గజాలు ఒక్కోక్కరు ఒక్కో విధంగా సమాధానిలిచ్చారు. మోడీ ప్రశ్నకు అసోచామ్ ప్రతినిధులు స్పందిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో ఎదురై ఇండియాను ఇబ్బందులు పెడుతున్న సమస్యల నుంచి గట్టెక్కేందుకు విధానకర్తలు 'బులెట్ ప్రూఫ్'ను ఏర్పాటు చేయాలని కోరారు.

అంతేకాదు వడ్డీ రేట్లను భారీగా తగ్గించాలని, చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలను పెంచాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మంచి భవిష్యత్తు ఉన్న దేశాల్లో ఇండియా ఒకటని ఐఎంఎఫ్ అంచనా వేసిన విషయాన్ని సమావేశానికి హాజరైన పారిశ్రామికవేత్తలు ప్రధానికి గుర్తు చేశారు.

చైనా ఆర్ధిక కష్టాలు, భారత్‌కు లాభాలు ఎలా?

చైనా ఆర్ధిక కష్టాలు, భారత్‌కు లాభాలు ఎలా?

న్యూఢిల్లీలో ఈరోజు ఉదయం పారిశ్రామిక దిగ్గజాలు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ప్రధాని మోడీ తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో "చైనాలో నెలకొన్న ఆర్థిక కష్టాలను ఇండియా లాభాలుగా మార్చుకోవడం ఎలా?" అని భారత పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోడీ సూటిగా ప్రశ్నించారు.
చైనా ఆర్ధిక కష్టాలు, భారత్‌కు లాభాలు ఎలా?

చైనా ఆర్ధిక కష్టాలు, భారత్‌కు లాభాలు ఎలా?

మరికొందరు తామూ ఊహించినంతగా సంస్కరణలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకబడిందని పలువురు అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, చైనా కష్టాలు భారత్‌కు లాభంగా మారడం కష్టమేనని స్పష్టం చేశారు. చైనా ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ గడిచిన రెండు నెలల్లో పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం కావడం ఇది రెండోసారి.
 చైనా ఆర్ధిక కష్టాలు, భారత్‌కు లాభాలు ఎలా?

చైనా ఆర్ధిక కష్టాలు, భారత్‌కు లాభాలు ఎలా?


అమెరికా వడ్డీరేట్లను పెంచనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాపార దిగ్గజాలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో భూసేకరణ, వస్తు, సేవా పన్ను(జీఎస్‌టీ) బిల్లులపై కూడా చర్చించారు.

 చైనా ఆర్ధిక కష్టాలు, భారత్‌కు లాభాలు ఎలా?

చైనా ఆర్ధిక కష్టాలు, భారత్‌కు లాభాలు ఎలా?

ఈ సమావేశానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్, ఎస్సార్ గ్రూపు హెడ్ శశి రుయా, రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, మహీంద్రా చీఫ్ ఆనంద్ మహీంద్రా, ఆదిత్యా బిర్లా గ్రూపు హెడ్ కుమార మంగళం బిర్లాతోపాటు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు.

English summary
Prime Minister, Narendra Modi chairing a high-level meeting on the global economic scenario, in New Delhi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X