ప్రధాని మోదీ కీలక నిర్ణయం - రాజీనామాలు, ముహూర్తం ఖరారు..!!

ప్రధాని మోదీ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు..పార్లమెంట్ ఎన్నికల ముందు అనూహ్య ప్రభుత్వం - పార్టీలో ప్రక్షాళనకు సిద్దం అయ్యారు. ఇందు కోసం కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ పరంగా జాతీయ, రాష్ట్ర స్థాయుల్లోనూ పలు కీలక మార్పులు జరగనున్నాయి. ఇందుకు ముందుగా జూలై 3న ప్రధాని కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ భేటీలో ప్రధాని మోదీ తన యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నారు.

ప్రధాని మోదీ భారీ కసరత్తు: కర్ణాటక ఎన్నికల తరువాత కీలక నిర్ణయాల దిశగా ప్రధాని కసరత్తు చేస్తున్నారు. కేంద్రంలోని మంత్రులు..రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వం విషయంలో అవసరమైన మార్పులకు నిర్ణయించారు. జూలై తొలి వారం లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన ప్రధాని మోదీ ఒక రోడ్ మ్యాప్ తో సిద్దమయ్యారు. జూలై 3న కేంద్ర మంత్రిమండలి పూర్తిస్థాయి సమావేశం జరపనున్నారు.

PM Modi

ఆ భేటీలో.. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారని, ఉమ్మడి పౌరస్మృతిపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ భేటీ తర్వాత అనేకమంది మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనీ చర్చ జరుగుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుకూలంగా.. జూలై 3నాటి భేటీ తర్వాత పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

ప్రభుత్వం - పార్టీలో ప్రక్షాళన: సాధారణంగా బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం అవుతుంది. మంత్రివర్గ సమావేశానికి కేంద్ర మంత్రలు హాజరవుతారు. ప్రత్యేక సందర్భాల్లో సహాయ మంత్రులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు అందరినీ ఆహ్వానించటం ద్వారా ప్రధాని మోదీ కీలక నిర్ణయం అమల్లో భాగంగానే ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రగతి మైదాన్‌లో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపా యి.

ఈ ఏడాది సెప్టెంబరులో ఇదే కన్వెన్షన్‌ సెంటర్‌లో జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ప్రభుత్వంలో ప్రస్తుతం ఒక కీలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్య నేతను కూడా తిరిగి పార్టీ బాధ్యతలకు పంపనున్నట్లు సమాచారం. పశ్చిమబెంగాల్‌ నుంచి కేంద్రంలో ప్రస్తుతం నలుగురు సహాయమంత్రులు ఉండగా.. వారి సంఖ్యను రెండుకు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు. వారిలో ఎవరినైనా క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది.

PM Modi

తెలుగు రాష్ట్రాల్లోనూ మార్పులు: త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు సంబంధించి ప్రచార కమిటీలు, ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీల ఏర్పాటుతో పాటు పార్టీ నాయకత్వ మార్పుల గురించి కూడా దృష్టి సారించినట్టు సమాచారం. ఇవి కాక, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాలలో కూడా సంస్థాగత మార్పులు తప్పవని తెలుస్తోంది.

తెలంగాణల బండి సంజయ్ మార్పు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలోనూ మార్పులు తప్పవని తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో గత రెండేళ్లుగా భారీ పునర్వ్యవస్థీకరణ జరగలేదు. ఈ సారి ఎంత మందికి ఉద్వాసన పలికి ఎంతమందికి స్థానం కల్పిస్తారో అన్నది చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+