Chandrayaan-3: ఇస్రో చీఫ్ సోమనాథ్ భుజం తట్టిన ప్రధాని మోడీ, ప్రయోగం ఇలా జరిగింది

బెంగళూరు: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంలో పాల్గొన్న బారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలను కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ. శనివారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)ను మోడీ సందర్శించారు.

ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఇస్రో చీఫ్ సోమనాథ్‌ను ఆనందంతో ప్రోత్సహిస్తూ ప్రధాని మోడీ భుజం తట్టారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు ఇస్ట్రాక్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ చంద్రయాన్-3 ప్రయోగంలో భాగమైన ఇస్రో శాస్త్రవేత్తలందరికీ ప్రధాని మోడీ అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. చంద్రయాన్-3 మిషన్‌లో కనుగొన్న విషయాలు, పురోగతి గురించి నరేంద్ర మోడీకి ఇస్రో చీఫ్ సోమనాథ్, శాస్త్రవేత్తలు వివరించారు.

PM Modi Meets Chandrayaan-3 Scientists At ISRO Mission Control Complex In Bengaluru

జై విజ్ఞాన్.. జై అనుసంధాన్ అనే నినాదం

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ..జై విజ్ఞాన్.. జై అనుసంధాన్ అనే నినదాన్ని ఇచ్చారు. చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అవడం గర్వంగా ఉందని చెప్పారు.

నేను దేశం నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. నా ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాను. చంద్రయాన్-3 విజయవంతం తర్వాత ఎప్పుడెప్పుడు భారత్ వస్తానా.. ఇస్రో శాస్త్రవేత్తలను కలుస్తాను.. అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాను అని ప్రధాని మోడీ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతీ భారతీయుడిని గర్వపడేలా చేశారని ప్రశంసించారు.

బెంగళూరులో దిగిన తర్వాత, మోడీ ట్విట్టర్ వేదికగా.. "చంద్రయాన్-3 విజయంతో భారతదేశం గర్వపడేలా చేసిన మా అసాధారణమైన ఇస్రో శాస్త్రవేత్తలతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాము. అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాల వెనుక వారి అంకితభావం, అభిరుచి నిజంగా చోదక శక్తులు అని పేర్కొన్నారు.

PM Modi Meets Chandrayaan-3 Scientists At ISRO Mission Control Complex In Bengaluru

బెంగుళూరులోని ISTRAC వెలుపల పోలీసులు, ఇస్రో అధికారులు గుమిగూడినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దక్షిణాఫ్రికా, గ్రీస్‌ల రెండు దేశాల పర్యటన తర్వాత ప్రధానికి బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో కూడా ఘనస్వాగతం లభించింది.
మరోవైపు,HAL విమానాశ్రయం వెలుపల, ISTRACకి దగ్గరగా ఉన్న జలహళ్లి క్రాస్ వద్ద భారీ ఎత్తున ప్రజలు గుమిగూడారు.

బుధవారం సాయంత్రం చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో భారతదేశంపై ప్రపంచ దేశాలు ప్రశంసలుకురిపించాయి. చారిత్రాత్మక ఘనతను సాధించిన మొదటి దేశంగా నిలిచింది భారత్. నాలుగు సంవత్సరాల క్రితం చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్‌పై నిరాశకు ముగింపు పలికింది.

చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగిన అమెరికా, చైనా, రష్యాల తర్వాత భారత్ నాలుగో దేశంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న అంతరిక్ష నౌకను ప్రయోగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+