కొబ్బరి నీళ్లు సేవనం, నేలపై నిద్ర - ప్రధాని మోదీ కఠిన దీక్ష..!!
దేశం మొత్తం రామ నామంతో ప్రతిధ్వనిస్తోంది. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీ 11 రోజుల అనుస్థానం నిష్ఠగాపాటిస్తున్నారు. కఠిన దీక్ష పాటిస్తున్నారు. ఈనెల 12 నుంచి ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రాముడికి అంకితం చేసిన సుమారు 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్‌ను ప్రధాని తన అధికారి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
Recommended Video

ప్రధాని దీక్ష: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠిన దీక్ష పాటిస్తున్నారు. సూర్యోదయానికి ముందుగానే నరేంద్ర మోడీ నిద్రలేస్తున్నారు. లేచిన వెంటనే కాలకృత్యాల్ని తీర్చుకొని ధ్యానం చేస్తున్నారు. ఆ తర్వాత యోగాసనాలు వేస్తున్నారు.

స్నానం చేసి కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతున్నారు. కఠినమైన తపస్సు చేస్తున్నారు.. కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతూ నిరంతరాయంగా పర్యటనలు చేస్తున్నారు. నేల మీద కేవలం దుప్పటి వేసుకుని నిద్రిస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభం పురస్కరించుకొని దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు.
భజనల లింక్స్: అక్కడ స్వచ్ఛ ఆలయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవం వేళ నిత్యం రాముడి కీర్తనలు వింటూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.
ఈ క్రమంలో రాముడికి అంకితం చేసిన సుమారు 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్‌ను ప్రధాని తన అధికారి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్లేలిస్ట్‌తో పాటు.. రామాయణ సందేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో స్పూర్తిని ఇచ్చిందంటూ భజన కీర్తనలకు సంబధించిన వీడియో లింక్స్‌ను కూడా నెట్టింట పోస్టు చేశారు.
The Ramayan's message has inspired people all across the world. Here are some Bhajans from Suriname and, Trinidad and Tobago:https://t.co/1yUFhKcFJKhttps://t.co/cRh8JwPnaDhttps://t.co/N13M3AETeJhttps://t.co/2ve6cvL5Zshttps://t.co/HaGGpgmNUc
— Narendra Modi (@narendramodi) January 19, 2024
Centuries may pass, oceans…
ఆలయాల సందర్శన: ప్రధాని మోదీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా కఠినమైన ఉపవాస దీక్ష పాటిస్తారు. నేలపై మాత్రమే నిద్రిస్తారు. చన్నీళ్ళతో స్నానం చేస్తారు. ఎటువంటి ఘన ఆహార పదార్థాలను ముట్టుకోరు. కేవలం నిమ్మరసం మాత్రమే తాగుతారు.
ప్రస్తుతం గోపూజ చేయటం, గోవులకు ఆహారం ఇవ్వటం పాటు అన్నదానం, వస్త్రదానం లాంటివి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాముడి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ రోజు, రేపు తమిళనాడులోని మరిన్ని ఆలయాలను ప్రధాని సందర్శించనున్నారు.












Click it and Unblock the Notifications