వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓవైపు పాక్ ప్రధానితో మోడీ భేటీ: మరోవైపు కాల్పులు

|
Google Oneindia TeluguNews

మాస్కో: భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లు శుక్రవారం ఉదయం రష్యాలోని ఉఫా నగరంలో సమావేశమయ్యారు.ఆత్మీయ కరచాలనంతో ప్రారంభించిన భేటీ దాదాపు గంటపాటు సాగింది. షెడ్యూల్డ్‌ టైమ్ కన్నా ఎక్కువసమయం సాగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. గురువారం రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇచ్చిన విందుకు కూడా మోడీ, నవాజ్ హాజరయ్యారు.

సరిహద్దు వివాదాలు, ఉగ్రవాదం తదితర అంశాలపై ఇరు ప్రధానులూ చర్చలు జరిపారు. ఇరు నేతల సమావేశానికి సంబంధించి వారిద్దరూ కరచాలనం చేస్తున్న ఫొటోలను భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ట్విట్టర్‌లో పెట్టి 'నైబర్‌హుడ్‌ ఎంగేజ్‌మెంట్‌' గా పేర్కొన్నారు.

ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని పాక్‌ విడుదల చేసిన అంశాన్ని మోడీ.. షరీఫ్‌తో ప్రస్తావనకు తీసుకువచ్చారు. ముంబై దాడులపై విచారణను వేగవంతం చేయాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయం తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌ జవానులు, పాక్‌ రేంజర్ల విషయంలో త్వరలో డీజీల స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

PM Modi and Pak PM Nawaz Sharif meet on sidelines of SCO summit

పాకిస్థాన్‌లో జరిగే సార్క్‌ సదస్సుకు మోడీని పాక్‌ ప్రధాని ఆహ్వానించారు. షరీఫ్‌ ఆహ్వానం మేరకు మోడీ 2016లో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు అంగీకరించారని విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ తెలిపారు. ఉగ్రవాద అంశాలపై ఢిల్లీలో ఇరుదేశాల భద్రతా సలహాదారుల సమావేశానికి నిర్ణయం తీసుకున్నారు.

15 రోజుల్లోగా మత్య్సకారులను విడుదల చేయాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. ఈ ఇరువురు నేతలూ గత ఏడాది నవంబరులో ఖాట్మండులో కూడా కలుసుకున్నారు కానీ అప్పుడు అధికారికంగా సమావేశం, ద్వైపాక్షిక చర్చలు జరగలేదు.

మరోసారి కాల్పులకు పాల్పడిన పాక్‌: జవాను మృతి

ఓ వైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌లు శుక్రవారం ఉదయం భేటీ అవుతుండగా.. మరోవైపు పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

భారత సైన్యంపై మరోసారి పాక్‌ కాల్పులకు తెగపపడింది. బరాముల్లా సెక్టారులోని నౌగామ్‌ ప్రాంతంలో గురువారం రాత్రి పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌ జవాను ఒకరు మృతిచెందారు.

English summary
Prime Minister Narendra Modi exchanged pleasantries with his Pakistani counterpart Nawaz Sharif during an informal dinner at the BRICS-SCO venue in Ufa on Thursday night, ahead of their formal meeting on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X