వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ విద్యార్థులతో పరీక్షా పే చర్చ.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఏం చెయ్యనుందంటే!!

|
Google Oneindia TeluguNews

ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థులకు పరీక్షలు అంటే భయం పోగొట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరీక్షలు అంటే భయపడుతున్న విద్యార్థులు చాలా మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై పరీక్షల కారణంగా ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇక ఈ మరణాలు ఎక్కువైపోతున్న క్రమంలో పరీక్షలు అంటే ఒత్తిడిని ఫేస్ చేస్తున్న విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, వారి చక్కగా పరీక్షలు రాసేలా వారితో ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమం ద్వారా మాట్లాడుతారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన నిర్వహించనున్నారు.

పరీక్షా పే చర్చ కు సిద్ధం అవుతున్న కేంద్రం

పరీక్షా పే చర్చ కు సిద్ధం అవుతున్న కేంద్రం


గతేడాది కూడా పరీక్షా పే చర్చలో పాల్గొన్న ప్రధాని మోడీ ఎంతో మంది విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆడుతూ, పాడుతూ విషయ పరిజ్ఞానం కోసం చదివి పరీక్షలు రాయాలన్నారు. బట్టీ పట్టటం మంచిది కాదన్నారు. ముందస్తు రివిజన్ చేసుకోవాలని, అయినా పరీక్షలు మొదటిసారి రాస్తున్నట్టు ఎందుకు భయపడుతున్నారని ఆయన విద్యార్థులకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు పరీక్షలు మరి కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఇక మరోపక్క పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఈనెల 27న పరీక్షా పే చర్చకు కేంద్రం ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

పాఠశాలల్లో విద్యార్థులు పరీక్షాపే చర్చ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం

పాఠశాలల్లో విద్యార్థులు పరీక్షాపే చర్చ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం


పాఠశాలల్లో విద్యార్థులు పరీక్షాపే చర్చ కార్యక్రమం వీక్షించడం, వినడం కోసం ప్రత్యక్ష ప్రసారానికి అంతరాయం లేకుండా తప్పనిసరిగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు పరీక్షా పే చర్చ కార్యక్రమం వీక్షించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని బిజెపి యోచిస్తోంది. దీనికోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది బిజెపి.

 తెలంగాణాలో పరీక్షా పే చర్చను మరింత విద్యార్థుల్లోకి తీసుకెళ్లనున్న బీజేపీ..

తెలంగాణాలో పరీక్షా పే చర్చను మరింత విద్యార్థుల్లోకి తీసుకెళ్లనున్న బీజేపీ..


ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల వద్దకు మరింత ఎక్కువగా తీసుకువెళ్లడానికి బిజెపి ఇప్పటికే చాలా పాఠశాలలలో వివిధ రకాల పోటీలను నిర్వహిస్తోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ఎగ్జామ్స్ వారియర్స్ అప్డేటెడ్ పుస్తకాలను కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తోంది. ఈ పుస్తకంలో పరీక్షలు ఒత్తిడి లేకుండా రాసేందుకు ఉపయోగపడే చాలా టిప్స్ ఉన్నాయి. అంతేకాదు ఈనెల 27వ తేదీన జరిగిన ప్రధాని పరీక్ష కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల విద్యార్థులు వీక్షించే విధంగా బిజెపి రాష్ట్ర శాఖ ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి కమిటీ వేసి, నేడు రేపు జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో దీనిపైన చర్చించనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీన్ లు ఏర్పాటు చేసి చూపించే యోచనలో బీజేపీ

రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీన్ లు ఏర్పాటు చేసి చూపించే యోచనలో బీజేపీ


దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి దరఖాస్తులు చేసుకున్న వారికి కొన్ని పోటీలను నిర్వహించి, అందులో విజేతలు అయిన వారికి మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రమే పాల్గొంటారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఈసారి విద్యార్థులను భాగస్వామ్యం చేయడంలో భాగంగా బిజెపి వేస్తున్న ఈ ప్లాన్ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి మరింత మైలేజ్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రతీ కార్యక్రమాన్ని ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకువెళ్లడానికి బీజేపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి పరీక్ష పే చర్చ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

English summary
Pariksha pe charcha 2023 Prime Minister Modi with students on January 27th. BJP, which is taking it ambitiously, will make appropriate arrangements to see the Pariksha pe charcha 2023 across the state of Telangana and to participate more students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X