వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెగాసస్ స్పై వేర్ దుమారం: విపక్షాల కామెంట్లు, ఇజ్రాయెల్‌తో బంధం మరింత బలోపేతం: మోడీ

|
Google Oneindia TeluguNews

పెగాసస్ స్పై వేర్ మరోసారి చర్చకు దారితీసింది. న్యూ యార్క్ టైమ్స్ కథనంలో రావడంతో డిస్కషన్ జరుగుతుంది. పెగాసస్ స్పై వేర్‌ను రక్షణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారత్ కొనుగోలు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో భారత ప్రధాని మోడీ స్పందించారు. ఇరు దేశాల అభివృద్దిలో దూసుకెళ్తున్నాయని మోడీ చెప్పారు. గత 30 ఏళ్ల నుంచి ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సమయం రెండు దేశాలకు చాలా ముఖ్యం అని మోడీ చెప్పారు.

ఇరు దేశాలు మంచి సంబంధాలను కలిగి ఉన్నాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధం కొనసాగుతోందని వివరించారు. శతాబ్దాలుగా దేశంలో వివక్ష లేకుండా.. సామరస్య వాతావరణంలో నెలకొందని తెలిపింది. తమ ప్రయాణంలో డెవలప్ జరుగుతుందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు.

 PM Modi Praises India-Israel Ties As Pegasus Snooping Row Returns

పెగాసస్ స్పైవేర్‌ సాయంతో చట్టవిరుద్ధంగా నిఘా ఉంచి దేశద్రోహానికి పాల్పడిందని ప్రతిపక్షాలు దాడి చేశాయి. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది.. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రతిపక్ష నాయకులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ.. ఇలా అందరూ ఫోన్‌ ట్యాపింగ్‌ దాడికి గురయ్యారు.. ఇది దేశద్రోహం.. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

స్పైవేర్‌ను రక్షణ పరంగా కాకుండా.. ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టడానికి ఉపయోగించారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. బీజేపీనే అది సాధ్యం. వారు దేశాన్ని బిగ్‌ బాస్‌ షోగా మార్చారని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా మోడీ ప్రభుత్వం స్పందించాలని అన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday said there cannot be a better time to set new goals for taking forward India-Israel relations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X