punjab elections 2022 : నవ పంజాబ్ కు మోడీ హామీ-గాంధీ కుటుంబంపై రిమోట్ కంట్రోల్ విమర్శ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అధికార కాంగ్రెస్ ను ఎలాగైనా గద్దె దింపాలని పట్టుదలగా ఉన్న ప్రధాని మోడీ తన ప్రచారంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని, పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
పంజాబ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన ప్రచారంలో టార్గెట్ చేసిన ప్రధాని మోడీ.. డ్రగ్స్, అప్పులతో కునారిల్లుతోందంటూ విమర్శించారు. వీటి నుంచి విముక్తి చేసి నవ పంజాబ్ కు రూపకల్పన చేస్తామంటూ ప్రధాని మోడీ ఓటర్లకు హామీ ఇచ్చారు. జలంధర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్ సింగ్‌ను 'అవమానకరంగా సాగనంపిందంటూ మోడీ విమర్శించారు. రిమోట్ కంట్రోల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డ్రగ్ రహిత 'నవ పంజాబ్' కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.

ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూడండి... వారి స్వంత నాయకులే తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ మోడీ గుర్తుచేశారు. అలాంటి పార్టీ పంజాబ్ కోసం ఎలా పని చేస్తుందని ప్రశ్నించారు. పంజాబ్ అభివృద్ధికి వారు ఎలా పని చేస్తారన్నారు. ఫిబ్రవరి 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పంజాబ్‌లో తన మొదటి భౌతిక ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అమరీందర్ సింగ్ కు చెందిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ తో పాటు శిరోమణి అకాలీదళ్ తో కలిసి పోటీ చేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు పెను సవాల్ విసురుతున్నాయి. రైతు ఉద్యమంలో బీజేపీ వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ ను పూర్తిస్ధాయిలో టార్గెట్ చేస్తోంది.












Click it and Unblock the Notifications