రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని ధన్యవాదాలు- లతా మంగేష్కర్ కు నివాళి-విపక్షాల నిరసనలు
గత కొన్నేళ్లలో భారతదేశం ఎంతో అభివృద్ధి ప్రగతి సాధించిందని లోక్‌సభలో ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఆయన ఇవాళ సమాధానం ఇచ్చారు. లోక్‌సభలో ప్రసంగం ప్రారంభించడానికి ముంందు ప్రధాని మోదీ నిన్న మృతిచెందిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కు నివాళులు అర్పించారు. ఆమె సంగీతం ద్వారా మన దేశాన్ని ఏకం చేసిందని మోడీ గుర్తుచేశారు.
ఇందులో రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ నాయకత్వ పాత్రను ఎలా పోషించగలదో ఆలోచించడానికి 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సరైన సమయమని మోడీ తెలిపారు. గత కొన్నేళ్లుగా భారతదేశం అనేక అభివృద్ధి పురోగతులను సాధించిందనేది అంతే నిజమన్నారు.

Recommended Video
గత కొన్నేళ్లుగా మన దేశం ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన అనేక రంగాలలో అభివృద్ధి చెందిందని మోడీ తెలిపారు. ఈ కార్యక్రమాలు ఇంతకు ముందు ఉన్నాయని, కానీ ఇప్పుడు పథకాలు అమలవుతున్న వేగం ప్రధానమని మోదీ చెప్పారు.
ఇప్పుడు మరుగుదొడ్లు ఉన్నాయని గ్రామస్తులు గర్వపడుతున్నారని తెలిపారు. ఎవరు సంతోషంగా లేరని ప్రశ్నించారు. ప్రధాని మోదీ గత పథకాలను వివరిస్తుండగా, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి లేచి నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications