కోవిడ్ లో భారత్ ఆకలి కేకలు తీర్చిన కేంద్ర పథకం-ఐఎంఎఫ్ తాజా అధ్యయనంలో కితాబు
రెండేళ్ల క్రితం భారత్ ను కమ్మేసిన కోవిడ్ మహమ్మారి ప్రజలకు ఆహారాన్ని దూరం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవన్న ఆందోళన వ్యక్తమైంది. సరిగ్గా అదే సమయంలో పేదల కడుపు నింపేందుకు కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో కొత్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం పేదల కడుపు నింపేందుకు అవసరమైన ఆహారధాన్యాలు, పప్పుల్ని సరఫరా చేశారు. దీని ప్రభావం కోవిడ్ సమయంలో బాగా కనిపించింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ కోవిడ్ సమయంలో భారత్ ఆర్ధిక పరిస్ధితి, ఇతర అంశాలపై విడుదల చేసిన నివేదికలోనూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై సానుకూల స్పందన వ్యక్తమైంది. కోవిడ్ సమయంలో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయకపోతే భారత్ తీవ్ర పేదరికంలోకి వెళ్లి ఉండేదని ఐఎంఎఫ్ తాజాగా వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి, పేదరికం, అసమానత కారణంగా భారతదేశం అత్యంత పేదరికంలోకి వెళ్లి ఉండేదని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కోవిడ్ సమయంలో ప్రతీ భారతీయుడు రోజుకు 1.9 యూఎస్ డాలర్ల కంటే తక్కువ కొనుగోలు శక్తి కలిగి ఉన్నట్లు తేల్చింది. 2019లో ఇది 1% కంటే తక్కువగా ఉందని, కానీ 2020లోనూ అది స్థిరంగా ఉందని వెల్లడించింది.

భారతదేశంలో తీవ్రమైన పేదరిక స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో పీఎంజీకేవై కీలకమని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. పేదలపై కోవిడ్ ప్రేరిత ఆదాయ షాక్‌లు తగలకుండా ఆహార అర్హతల రెట్టింపు గణనీయంగా పనిచేసిందని వెల్లడించింది. గత నెల, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ పథకం కింద అవసరమైన వారికి ఉచిత ఆహార ధాన్యం అందిస్తున్నారు.
వరుసగా రెండు సంవత్సరాలుగా అతి తక్కువ స్థాయి పేదరికం, కోవిడ్ మహమ్మారి ఉన్నా తీవ్ర పేదరిక నిర్మూలన జరిగినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి నివేదిక తెలిపింది.
-
రాష్ట్రానికి 7వ వేతన సంఘం వర్తింపు -
మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. నారీశక్తికి పట్టాభిషేకం -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ టీమ్ మారబోతున్నాడా ? భారత మాజీ హింట్..! -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..












Click it and Unblock the Notifications