వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే

|
Google Oneindia TeluguNews

దేశీయంగానేకాదు, అంతర్జాతీయంగానూ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని మరోసారి నిజం చేస్తూ.. దాయాది దేశాల అధినేతలు అనూహ్య వ్యూహాలతో రెండు దేశాల ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు, కొత్త అవసరాల రీత్యా భారత్, పాకిస్తాన్ లు మళ్లీ శాంతి బాటపట్టాయి. గడిచిన రెండేళ్లుగా మూసుకుపోయిన అన్ని దారులను తిరిగి తెరిచేందుకు సమాయత్తం అయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వం ఫలించగా భారత్, పాక్ రోజుకో కీలక ప్రకటనను వెలువరిస్తున్నాయి. ఆ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం సంచలనానికి వెనుకాడలేదు..

ఐపీఎస్ ప్రవీణ్‌‌ను 'ఎవడు’ అంటే తప్పేంటి? -ఎంపీల ముందు అధికారుల స్థాయి చాలా చిన్నది: రఘురామఐపీఎస్ ప్రవీణ్‌‌ను 'ఎవడు’ అంటే తప్పేంటి? -ఎంపీల ముందు అధికారుల స్థాయి చాలా చిన్నది: రఘురామ

ఇమ్రాన్‌కు మోదీ లేఖ

ఇమ్రాన్‌కు మోదీ లేఖ


'ఉగ్రవాదుల కార్ఖానా'.. 'ఛీ, స్నేహం మీతోనా', 'మా జోలికొస్తే ఇంట్లోకి దూరి మరీ దెబ్బతీస్తాం (ఘర్ మే గుస్ కర్ మారేంగే)', 'నోటితో శాంతి, చేతల్లో టెర్రరిజం', 'మైనార్టీలపై హిందువులను రాచి రంపాన పెడుతోన్న దుర్మార్గ పొరుగు దేశం'.. ఇవీ, వివిధ సందర్భాల్లో పాకిస్తాన్ ను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చేసిన కామెంట్లలో కొన్ని. మాటల ద్వారానేకాదు, గడిచిన రెండేళ్లలో భారత్ తన చేతలతోనూ పాకిస్తాన్ ను రకరకాలుగా ఎండగట్టే ప్రయత్నం చేసింది. సందర్బం ఏదైనా పాకిస్తాన్ ఉగ్రనీతిని ప్రస్తావించడం మోదీకి ఒక అలవాటుగానూ మారింది. అయితే ఇప్పుడు సీన్ మరోలా మారింది. పాకిస్తాన్ తో స్నేహహస్తం కోరుతూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మన ప్రధాని మోదీ ఓ లేఖ రాశారు.

భారత్-పాక్ భాయిభాయి

భారత్-పాక్ భాయిభాయి


దాయాది పాకిస్తాన్ లో మార్చి 23న జాతీయ దినోత్సం(పాకిస్తాన్ డే) జరిగింది. ఆ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోపాటు ఆ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ భారత ప్రధాని మోదీ అధికారికంగా ఓ సందేశాన్ని పంపించారు. ఆ లేఖలోనే రెండు దేశాల మధ్య స్నేహం, ఉగ్ర సంబంధిత సమస్యలను కూడా ప్రస్తావించారు. పాకిస్తాన్ తో భారత్ హృదయపూర్వక స్నేహాన్ని కోరుతున్నదని మోదీ లేఖలో పేర్కొన్నారు. కరోనా విలయం కారణంగా మానవాళి కష్టాలను ఎదుర్కొంటున్నదని, ఆ మహమ్మారిపై పోరులో పాక్ ప్రజలు విజయం సాధించాలని కోరుతున్నట్లు మోదీ తెలిపారు. అయితే,

భారత్-పాక్ రహస్య శాంతి ప్రణాళిక -యూఏఈ మధ్యవర్తిత్వం -ఇమ్రాన్‌కు మోదీ విషెస్ - త్వరలో సంచలనాలుభారత్-పాక్ రహస్య శాంతి ప్రణాళిక -యూఏఈ మధ్యవర్తిత్వం -ఇమ్రాన్‌కు మోదీ విషెస్ - త్వరలో సంచలనాలు

షరతులు వర్తిస్తాయి సుమా..

షరతులు వర్తిస్తాయి సుమా..

రెండురోజుల కిందట, కరోనా బారినపడ్డ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ కూడా చేసిన మన ప్రధాని మోదీ.. దాయాదికి రాసిన తాజా లేఖలో మరోసారి కరోనా, స్నేహబంధం అంశాలతో పాటు కొన్ని చురకలు కూడా తగిలించారు. పాకిస్తాన్ తో భారత్ స్నేహాన్ని కోరుతుందంటూనే కొన్ని కండిషన్లు పెట్టారు. 'భీభత్సం, శత్రుత్వం లేని విశ్వసనీయ వాతావరణం'లో మాత్రమే రెండు దేశాల మధ్య బంధం విలసిల్లుతుందని మోదీ తన లేఖలో కరాకండిగా చెప్పారు. అయితే, దోస్తానా పునరుద్దరణకు సంబంధించి గతంలో పలు మార్లు పాజిటివ్ కామెంట్లు చేసిన ఇమ్రాన్.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నందున మోదీ లేఖపై వెంటనే స్పందిచలేదు. కాగా,

దేశ విభజనకు బీజం పడినరోజే

దేశ విభజనకు బీజం పడినరోజే

పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాల్లో భారత్, పాక్ తీవ్రంగా వాదులాడుకోవడం, పరస్పరం దాడులు చేసుకోవడం, యుద్ధానికి సైతం వెనుకాడబోమని ప్రకటనలు చేయడం తెలిసిందే. అయితే, బంధాల పునరుద్ధరించుకునే దిశగా ప్రధాని నరేంద్ర మోదీనే చొరవ ప్రదర్శిస్తూ ఇమ్రాన్ కు లేఖ రాయడం, అది కూడా 'పాకిస్తాన్ డే' సందర్భంగా స్నేహ హస్తం అందించడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే, దేశవిభజనకు బీజం పడిన మార్చి 23ను 'పాకిస్తాన్ డే'గా జరుపుతుంటారు. 1940, మార్చి 23న నాటి ఆలిండియా ముస్లిం లీగ్ 'లాహోర్ రిజల్యూషన్' పేరుతో భారత్ లోని ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని తొలిసారిగా తీర్మానించిన రోజది. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్టు 14గా, భారత స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్టు 15గా కొనసాగుతున్నా, దాయాది దేశం 'పాకిస్తాన్ డే'ను మాత్రం మార్చి 23నే నిర్వహిస్తూ వస్తున్నది. నిజానికి మోదీ గతంలోనూ ఈ సందర్భంగా మర్యాదపూర్వక లేఖలు రాశారు. అయితే, ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈసారి లేఖకు అధిక ప్రాధాన్యం దక్కింది. అంతేకాదు..

భారత్-పాక్ భాయి భాయి -2ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు -సింధు జల వివాదాల పరిష్కారం దిశగాభారత్-పాక్ భాయి భాయి -2ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు -సింధు జల వివాదాల పరిష్కారం దిశగా

Recommended Video

TOP NEWS : India-Pak భాయి భాయి -2 ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు! || Oneindia Telugu
అటు పాక్‌కు లేఖ, ఇటు బంగ్లా టూర్..

అటు పాక్‌కు లేఖ, ఇటు బంగ్లా టూర్..


2014లో మోదీ తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేసే కార్యక్రమానికి నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముఖ్యఅతిథిగా రావడం, తర్వాతి కాలంలో మోదీ సడెన్ గా లాహోర్ లో ప్రత్యక్షమై నవాజ్ ఇంట్లో బిర్యానీ తిని రావడం, 2019 పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాల సంబంధాలు పూర్తిగా తెగిపోవడం తెలిసిందే. అయితే, బైడెన్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా అనుసరిస్తోన్న నూతన ఎత్తుగడలు, అఫ్గానిస్తాన్ విషయంలో పాక్, భారత్ కలిసి పనిచేయాలంటూ పెద్దన్న ఒత్తిడి చేయడం, ఆ మేరకు యూఏఈ మధ్యవర్తిత్వం వహించడం లాంటి పరిణామాలు పరిస్థితిని మార్చేశాయి. ఇటు పాకిస్తాన్ కు స్నేహ లేఖలు రాసిన ప్రధాని మోదీ.. అటు బంగ్లాదేశ్ తోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26, 27 తేదీల్లో మోదీ బంగ్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఏడాది తర్వాత ఆయన చేస్తోన్న తొలి విదేశీ పర్యటన బంగ్లాకే.

English summary
India desires cordial relations with Pakistan but an atmosphere of trust, devoid of terror and hostility, is "imperative" for it, Prime Minister Narendra Modi said in a letter to his Pakistani counterpart Imran Khan. PM Modi wrote the letter to Mr Khan to extend greetings to the people of that country on the occasion of Pakistan Day. "As a neighbouring country, India desires cordial relations with the people of Pakistan. For this, an environment of trust, devoid of terror and hostility, is imperative," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X