మొబైల్ యాప్‌లోను మోడీదే హవా, గ్లోబల్ యంగ్ లీడర్‌గా స్మృతి
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక అనుసంధాన వేదికల్లో అందరికంటే ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా.. మొబైల్ యాప్ వైబర్‌లోను అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్నారని తేలింది. ఈ ఏడాది జనవరి 26న వైబర్‌లో ప్రధాని మోడీ చేరారు.
ఆయనకు ప్రస్తుతం ఎనిమిదిన్నర లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారని వైబర్ యాజమాన్యం మంగళవారం తెలిపింది. భారత దేశంలో సుమారు 3.7 కోట్ల మంది వైబర్‌ను వినియోగిస్తున్నారు.
యువ అంతర్జాతీయ నేతగా స్మృతి ఇరానీ

వరల్డ్ ఎకనామిక్ ఫెడరేషన్ విడుదల చేసిన యువ అంతర్జాతీయ నేతల జాబితాలో భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమానవ వరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చోటు దక్కించుకున్నారు. పాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో పని చేసే స్థాయి నుండి దేశంలో ఉన్నతస్థాయి రాజకీయ నేతగా ఆమె ఎదిగారని డబ్ల్యూఈఎఫ్ ప్రశంసించింది.
ప్రపంచ భవిష్యత్తు కోసం 40 ఏళ్లలోపు గల వ్యక్తులు చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి ఏటా ఈ సంస్థ జాబితా రూపొందిస్తుంది. 2015కుగాను 187 మందితో జాబితాను రూపొందించింది. ఇందులో భారత్ నుండి 11 మందికి స్థానం లభించింది.
అసోము ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్, జీఎమ్మార్ సంస్థకు చెందిన కిరణ్ కుమార్ గాంధీ, బ్లూక్రెస్ట్ ఆశిష్ గోయల్, వన్యప్రాణుల అధ్యయన సంస్థ ఈడీ కీర్తి, ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్, ఇండియా ఆర్ట్ ఫెయిర్ స్థాపకులు నేహా కిర్బాల్, లెహర్ ఫుడ్స్ సీఈవో శాలినీ పుచ్చలపల్లి, ఇండియా టుడే సహా సంపాదకులు శ్వేతా పుంజ్, బైస్ అండ్ కంపెనీస్ ప్రశాంత్ సారిన్, మెట్రోపొలిస్ హెల్త్ కేర్ ఎండీ అండ్ సీఈవో అమీర్ షాలు ఉన్నారు.












Click it and Unblock the Notifications