వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాతికేళ్లు స్వదేశీ వస్తువులు వాడితే నిరుద్యోగం మాయం-ప్రధాని మోడీ కీలక సూచన

|
Google Oneindia TeluguNews

భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కీలక సమస్యల్లో నిరుద్యోగం కూడా ఒకటి. అధికారంలోకి రాగానే నిరుద్యోగాన్ని రూపుమాపుతానని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ.. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు దీనిపై కీలక సూచన చేశారు. దేశంలో నిరుద్యోగం రూపుమాపాలంటే ఏం చేయాలో ప్రజలకు స్పష్టం చేశారు.

ఈ క్లిష్ట సమయంలో భారతదేశం స్తబ్దుగా ఉండలేకపోతోదని ప్రధాని మోడీ తెలిపారు. మనం స్వయం సమృద్ధిగా మారాలన్నారు. స్థానికంగా తయారైన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రానున్న 25 ఏళ్ల పాటు ప్రజలు స్థానిక వస్తువులను వినియోగిస్తే దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదన్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించిన అనంతరం మోదీ మాట్లాడారు.

pm modi says no unemployment issue if people use swadesi goods for next 25 years

భారతదేశం ఇవాళ స్తబ్దుగా ఉండలేకపోతుందదని, మనం మెలకువగా ఉన్నా నిద్రపోతున్నా, ఉన్న చోటనే మనం కొనసాగలేమని ప్రధాని తెలిపారు. ప్రపంచమంతా 'ఆత్మనిర్భర్' ఎలా అని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు.

దేశానికి చెందిన సాధువులను తాను స్థానిక ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడాన్ని ప్రజలకు బోధించమని అభ్యర్థిస్తానని మోడీ తెలిపారు. మన ఇళ్లలో, మనం మన వ్యక్తులు తయారుచేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎక్కువ మంది ఏం చేస్తున్నారో చూడాలని కోరారు. విదేశీ తయారీ వస్తువులను మనం ఇష్టపడవచ్చు, కానీ ఈ వస్తువులు మన ప్రజల కష్టార్జిత అనుభూతిని కలిగి ఉండవు, మన మాతృభూమి పరిమళాన్ని కలిగి ఉండవంటూ మోదీ అన్నారు.

సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బిలో 'పరమ్ పూజ్య కేశ్వానంద్ జీ' ఆశ్రమం వద్ద హనుమంతుని విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. హనుమాన్‌జీ చార్‌ ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు దిక్కుల్లో ఏర్పాటు చేస్తున్న నాలుగు విగ్రహాల్లో ఇది రెండోది.

English summary
pm modi on today made key suggestion to eradicate unemployment in the country with swadesi goods usage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X