
చెంగుచెంగున కృష్ణజింకలు .. అద్భుతంగా వర్ణిస్తూ వన్య ప్రాణులపై ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ !!
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఒక అందమైన అరుదైన దృశ్యాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. గుజరాత్‌లోని ఒక జాతీయ ఉద్యానవనంలో వేలాది కృష్ణజింకలు రోడ్డు దాటిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు . ఇక ఈ అరుదైన దృశ్యాన్ని అద్భుతమైనదని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు.
రోటీలు చేసి, జ్యూస్ అమ్ముతూ సోను సూద్ .. చిరు వ్యాపారిగా మారిన రియల్ హీరో .. రీజన్ ఇదే
గుజరాత్ సమాచార శాఖ పోస్ట్ చేసిన కృష్ణజింకల వీడియోను రీ పోస్ట్ చేసిన ప్రధాని మోడీ
మొదట గుజరాత్ సమాచార శాఖ ట్వీట్ చేసిన వేలావదార్ కృష్ణజింకల నేషనల్ పార్క్ వద్ద వేలాది సంఖ్యలో చెంగుచెంగున రోడ్డు దాటుతున్న కృష్ణజింకల వీడియోను పిఎం మోడీ రీట్వీట్ చేశారు. ప్రధానమంత్రి వీడియోని పోస్ట్ చేసి జంతువులపై ఉన్న తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. ప్రకృతిలో ఆహ్లాదంగా రోడ్డు దాటుతున్న జంతువుల గుంపులో 3 వేలకు పైగా కృష్ణజింకలు ఉన్నాయని, ఇవి గాలిలో ఎత్తుకు దూకుతున్నప్పుడు వాటి అందం కళ్లారా చూడాల్సిందేనని గుజరాత్ సమాచార శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.

వర్షాకాలంలో వేల సఖ్యలో గుంపులుగా తిరిగే కృష్ణజింకల అందాలు
వేలావదార్ పార్క్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఎం హెచ్ త్రివేది వర్షాకాలంలో వీటి అందాలు వర్ణించ వీలు కాదని, భారీగా గుంపులుగా సంచరించే కృష్ణజింకల అందాలను చూడవచ్చని చెప్పారు. కృష్ణజింకల అందాలను చిత్రీకరించిన ఈ వీడియో జంతువులకు భంగం కలిగించలేదని , వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దూరంనుండి చిత్రీకరించామని ఆయన పేర్కొన్నారు. వేలావదర్ నేషనల్ పార్క్ లో కృష్ణ జింకలను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. ఈ పార్కు కృష్ణజింక లకు ప్రసిద్ది చెందింది. ఇది 7,000 కృష్ణ జింకలను ప్రస్తుతం కలిగి ఉందని వెల్లడించారు .

గుజరాత్ వేలావదార్ నేషనల్ పార్క్ లో కనువిందు చేసేలా జంతువులు, పక్షులు
దక్షిణాన ఖంబాట్ గల్ఫ్ తీరాన్ని తాకుతూ, ఈ అభయారణ్యం 34 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కృష్ణ జింక లతోపాటు , ఈ పార్కులో గణనీయమైన సంఖ్యలో పక్షులు మరియు జంతు జాతులు ఉన్నాయి. పెలికాన్స్ , ఫ్లెమింగోలు వంటి అనేక జాతుల వలస పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు. అలాంటి వేలావదర్ నేషనల్ పార్క్ అభయారణ్యంలో చెంగుచెంగున దూకుతున్న కృష్ణ జింకలను ఓ అద్భుతంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

అంతరించిపోతున్న కృష్ణజింకల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
కృష్ణజింకలు రక్షిత జంతువులు. వాటి వేట 1972 నుండి వన్యప్రాణి చట్టం క్రింద నిషేధించబడింది. ఒకప్పుడు భారత ఉపఖండంలో విస్తృతంగా కనిపించిన కృష్ణజింకలు అధిక వేట, అటవీ నిర్మూలన , అటవీ ప్రాంతాలలో ఇళ్ళు నిర్మించుకోవడం వంటి కారణాల వల్ల వాటి సంఖ్య బాగా తగ్గింది. అంతరించిపోతున్న జాతుల్లో ఇవి ఒకటి గా మారాయి. అయితే వీటిని సంరక్షించడానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నాయి.