Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ నోరు విప్పాలి: పిఎన్బీ స్కామ్‌పై రాహుల్ ధ్వజం

Recommended Video

    PNB scam : Rahul Gandhi Questions Modi's Silence

    న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ కుంభకోణం ఎందుకు జరిగిందో, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి తీసుకున్న చర్యలేమిటో వివరించాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు.

    నీరవ్ మోడీ 11,400 కోట్ల మేర అక్రమాలకు పాల్పడి విదేశాలకు చెక్కేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు తన బాధ్యతలు అంగీకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ తప్పించుకుంటోందని ఆయన అన్నారు.

    Rahul Gandhi

    నోట్ల రద్దు నుంచి ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోడీ తన చర్యల ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నీరవ్ మోడీ కుంభకోణం విషయంలో ఏం జరిగిందో, ఎలా ఎందుకు జరిగింందో, దానిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రధాని నోరు విప్పి చెప్పాలని అన్ారు.

    అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) స్థానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    నీరవ్ మోడీతో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయనీ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యానని బిజెపి తనపై చేస్తున్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. బిజెపి సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది విమర్శించారు.

    అర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే చర్యల ద్వారా మోడీ ప్రజల జేబుల్లోంచి డబ్బులు కొల్లగొట్టి బ్యాంకింగ్ రంగంలో పెట్టారని, ఇప్పుడు ఆయన మిత్రులు బ్యాంకింగ్ రంగాన్ని కొల్లగొడుతున్నారని, ఆయన మాత్రం మాట్లాడడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. పిల్లలకు గంట, గంటన్నర తరగతులు తీసుకుని పరీక్షలు ఎలా రాయాలో చెప్పడం కన్నా మోడీ నీరవ్ మోడీ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో, బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణకు ఏం చేస్తున్నారో ప్రజలకు ప్రధాని చెప్పాలని ఆయన అన్నారు.

    అది 2016 నవంబర్ 8వ తేదీన వేయి, ఐదు వందల నోట్ల రద్దుతో ప్రారంభమైందని, ప్రజల జేబుల్లోంచి డబ్బంతా తీయించి బ్యాంకుల్లో పెట్టించారని ఆయన అన్నారు. నీరవ్ మోడీ 22 వేల కోట్ల ప్రజల డబ్బును కొల్లగొట్టుకుని పోతే పరీక్షలు ఎలా రాయాలో విద్యార్థులకు చెప్పే తీరిక మోడీకి దక్కడం విచిత్రమని రాహుల్ గాంధీ అన్నారు. నీరవ్ మోడీ 22 వేల కోట్లు కొల్లగొట్టిన వ్యవహారానికి బాధ్యులెవరో మోడీ ప్రజలకు చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై రక్షణ మంత్రి, సామాజిక న్యాయ కల్పన మంత్రి మాట్లాడుతున్నారు గానీ బాధ్యత వహించాలని ప్రధాని గానీ ఆర్థిక మంత్రి గానీ మాట్లాడడం లేదని ఆయన తప్పు పట్టారు అత్యున్నత స్థాయి రక్షణ లేకపోతే అంతటి కుంభకోణం జరగదని ప్రధాని మోడీ విస్మరించడాన్ని బట్టే అర్తమవుతోందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మాటలతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు.

    కుంభకోణం కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో 2011లో జరిగిందనే బిజెపి ఆరోపణను ఆయన ఖండించారు. అది 2015 మేలో ప్రారంభమైందని చెప్పారు. మొదటి ఫిర్యాదు 2015లో ఇవ్వడం జరిగిందని, 90 శాతం లావాదేవీలు ఈ ప్రభుత్వ హయాంలో జరిగాయని ఆయన అన్నారు. ప్రధాని మోడీ వికెట్ కీపర్ వైపు చూస్తూ బ్యాటింగ్ చేస్తారని తాను కర్ణాటక సభలో చెప్పానని ఆయన గుర్తు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+