వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ చారిత్రక అవసరం, దోపిడీదారులపై కఠిన వైఖరి : మోడీ

ఈ రోజు నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ చారిత్రక అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢిల్లీలో ఐసీఏఐ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతూ ఆర్థిక రంగం బలంగా ఉండేందుకు సీఏలు కృషి చేయాలని పిలు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ రోజు నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ చారిత్రక అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జీఎస్టీ అమలు దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయమని ఆయన పేర్కొన్నారు.

శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఐసీఏఐ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఛార్టెడ్ అకౌంటెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక రంగం బలంగా ఉండేందుకు సీఏలు తగిన కృషి చేయాలని పిలుపునిచ్చారు.

PM Modi to speak on GST at ICAI event

తమ ప్రభుత్వం దేశాన్ని దోచుకునే వారి పట్ల కఠిన వైఖరి అవలంభిస్తోందని, ఏ దేశంలో ఆర్థిక పరమైన దోపిడీ జరుగుతుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనించలేదని ప్రధాని అన్నారు.

అలాంటి దోపిడీనే తమ ప్రభుత్వం అరికడుతోందని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక దోపిడీ చేసే వారి గుండెల్లో భయం పుట్టించిందని వ్యాఖ్యానించారు.

ఆర్థికపరంగా జరుగుతున్న తప్పులను గుర్తించి.. అది తప్పు అని చెప్పే ధైర్యం సీఏలకే ఉందని, భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే అవకాశం కూడా సీఏలకే ఉందని ప్రధాని పేర్కొన్నారు.

వైద్యులు రోగుల వ్యాధులను నయం చేస్తారని, ఛార్టెడ్ అకౌంటెంట్లు ఆర్థిక పరమైన జబ్బులను నయం చేయాలని సూచించారు. భారత సీఏలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని మోడీ అన్నారు.

English summary
Prime Minister Narendra Modi will address the foundation day function of chartered accountants' apex body ICAI on Saturday where he will speak on the Goods and Services Tax (GST).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X