నేను మాజీ ప్రధాని దేవేగౌడతో ఫోన్‌లో మాట్లాడాను: నరేంద్ర మోడీ ట్వీట్
న్యూఢిల్లీ/బెంగళూరు: శుక్రవారం జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో మోడీ ట్వీట్ చేశారు. దేవుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
'నేను మాజీ ప్రధాని దేవెగౌడతో మాట్లాడాను. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కలిగుండాలని ప్రార్థిస్తున్నా' అని మోడీ ట్వీట్ చేశారు. కాగా, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సమయంలోనూ నరేంద్ర మోడీ... దేవెగౌడను ప్రశంసల వర్షం కురిపించారు.

Recommended Video

కర్ణాటకలో రసవత్తర రాజకీయం సాగుతోన్న విషయం తెలిసిందే. ఒకవైపు సుప్రీంకోర్టు అరుదైన రీతిలో అర్థరాత్రి ఇచ్చిన ఆదేశాలు, మరోవైపు విపక్షాల విమర్శలు, నిరసనల హోరు మధ్య గురువారం ఉదయం యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా నిరాడంబరంగా ప్రమాణం చేశారు. సభలో బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చినా తమకు అంత సమయం అవసరం లేదని, ఈలోపే నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications