గిన్నిస్ రికార్డు: నరేంద్ర మోడీ సూటు రూ 4.31 కోట్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన సూటు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా గిన్నిస్ రికార్డులో నమోదు అయ్యింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వహకులు అధికారికంగా సర్టిఫికెట్ జారీ చేశారు.
నరేంద్ర మోడి ధరించిన సూటు రూ 4,31,31,311 అమ్ముడైయ్యిందని వెల్లడించింది. విదేశాల్లో నివసిస్తున్న రమేష్ విరాణి అనే వ్యాపారవేత్తకు ఓ ఆలోచన వచ్చింది. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పేరు కనిపించేలా ఓ సూటు తయారు చేయించాలని అనుకున్నాడు.
అదేవిధంగా చక్కటి సూటు తయారు చేయించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చిన సందర్బంలో నరేంద్ర మోడీ ఆ సూటు ధరించారు.

ఖరీదైన సూటు ధరించారని నరేంద్ర మోడీపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. వ్యాపారవేత్త రమేష్ విరాణి రూ. 11 లక్షల వ్యయంతో తయారు చేయించిన సూటును వేలం పెట్టారు.
గుజరాత్ కు చెందిన లాల్జీభాయ్ తులసిబాయ్ పటేల్ అనే ఆయన 2015 ఫిబ్రవరి 20వ తేదిన సూరత్ లో జరిగిన వేలంలో నరేంద్ర మోడీ సూటును రూ 4.31 కోట్లకు దక్కించుకున్నారు. ఇప్పుడు ఇదే అత్యధిక సూటు ధర అని గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications