గోవా అసెంబ్లీ పోరు వేళ మోడీ కీలక వ్యాఖ్యలు-రాజ్యసభలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ
గోవా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న వేళ ప్రధాని మోడీ రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. గోవాలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, భారత తొలి ప్రధాని నెహ్రూ నిర్ణయాలపైనా మోడీ విమర్శలకు దిగారు. దీంతో గోవా ఎన్నికల ర్యాలీ తరహాలోనే కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకు మోడీ ప్రయత్నించారు.
Recommended Video
గోవాపై గతంలో విదేశీ శక్తులు దాడి చేసినప్పుడు భారత తొలి ప్రధాని నెహ్రూ సాయం చేసేందుకు ముందుకు రాలేదంటూ ప్రధాని మోడీ ఆరోపించారు. గోవాలపై స్వాతంత్ర సమరయోధులపై దాడులు జరిగినప్పుడు సైతం నెహ్రూ మౌనం వహించారంటూ మోడీ విమర్శలు గుప్పించారు. నెహ్రూ కేవలం తన ఇమేజ్ కోసమే ప్రయత్నించారంటూ మోడీ విమర్శించారు.

తాజాగా మృతిచెందిన గాయని లతా మంగేష్కర్ ను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. గోవా ఆల్ ఇండియా రేడియాలో పనిచేస్తున్న గాయని లతా మంగేష్కర్ సోదరుడు హృదయ్ నాథ్ ను కాంగ్రెస్ హయాంలో తొలగించిన విషయాన్ని కూడా మోడీ గుర్తుచేశారు. వీర్ సావర్కర్ పై కార్యక్రమం నిర్వహించారన్న కారణంతో గాయని లతామంగేష్కర్ తమ్ముడు హృదయ్‌నాథ్‌ను కాంగ్రెస్ పక్కన పెట్టిందని మోడీ తెలిపారు. ఎమర్జెన్సీని సమర్ధించలేదన్న కారణంతో కిషోర్ కుమార్ ను సైతం బాయ్ కాట్ చేశారన్నారు.












Click it and Unblock the Notifications