కరోనా వైరస్... మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ
మంగళవారం (మార్చి 24) రాత్రి 8గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వారం రోజుల వ్యవధిలో ప్రధాని రెండోసారి జాతిని ఉద్దేశించి మాట్లాడబోతుండటం గమనార్హం. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మోదీ ఏం చెప్పబోతున్నారు.. ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది.
దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో ఆర్ఠిక వ్యవస్థ కుప్ప కూలకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే చాలాచోట్ల ప్రజలు లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.

అంతకుముందు మరో ట్వీట్‌లో మోదీ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ప్రస్తావించారు. పరిశ్రమలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని.. అత్యవసరమైతే తప్ప కార్యాలయాలకు పిలవవద్దని చెప్పారు. అలాగే అన్ని మీడియా సంస్థలు సోషల్ డిస్టెన్స్ గురించి ప్రజలకు పదేపదే చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మరో ట్వీట్‌లో కరోనా వైరస్ నియంత్రణకు భారత్ చేస్తున్న కృషిని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించిందని తెలిపారు. భారత్‌కు కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సత్తా ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నట్టుగా తెలిపారు.
Recommended Video
దేశంలో ఇప్పటివరకు దాదాపుగా 490 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,81,761 పాజిటివ్ కేసులు నమోదవగా.. 16,558 మంది మృతి చెందారు. ఇందులో 1,02,429 మంది కోలుకున్నారు. వైరస్ నియంత్రణకు ఇప్పటికే చాలావరకు దేశాలు విమాన సర్వీసులను నిలిపివేసి లాక్ డౌన్ కూడా ప్రకటించాయి.












Click it and Unblock the Notifications