ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం?
కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సాయంత్రం 7 గంటలకు సీసీఎస్ భేటీ ఆరంభమౌతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల దేశంలో తలెత్తిన పరిణామాలను ఇందులో సమీక్షిస్తారు. యుద్ధం వల్ల దేశం ఎదుర్కొంటోన్న సమస్యలు, ఇంధన సంక్షోభం, వీటిని అధిగమించడానికి అవసరమైన నివారణోపాయాలు.. వంటి అంశాలపై చర్చిస్తారు.
దేశ భద్రత, వ్యూహాత్మక విషయాలు, రక్షణ వ్యయాలపై సీసీఎస్ అత్యున్నత మండలి సమీక్షించనుంది. 10 రోజుల వ్యవధిలోనే సీసీఎస్ భేటీ కావడం ఇది రెండోసారి. కిందటి నెల 22న ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం ఏర్పాటైంది. అప్పట్లో ఇజ్రాయెల్-అమెరికా దాడులతో మొదలైన మధ్యప్రాచ్య యుద్ధం గురించి చర్చించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై దీని ప్రభావం పడుతుందని, మొత్తం ప్రపంచాన్ని ఏదో ఒక రూపంలో వెంటాడుతుందని వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితుల మధ్య అతి తక్కువ సమయంలోనే సీసీఎస్ రెండోసారి భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రాంతీయ యుద్ధాలు, సరిహద్దు చొరబాట్లు, నిత్యావసరాలు, ఎనర్జీ సప్లై చైన్ భద్రత వంటి కీలక సమస్యలపై చర్చించడానికి తరచుగా సీసీఎస్ సమావేశమౌతుంటుంది. ప్రధాని మోడీ అధ్యక్షత వహించే ఈ కమిటీలో రక్షణ, ఆర్థిక, హోమ్, విదేశాంగ మంత్రులు సభ్యులుగా కొనసాగుతున్నారు.
సాయంత్రం జరిగే ఈ భేటీలో ప్రధాని మోదీ, రాజ్ నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, అమిత్ షా, సుబ్రహ్మణ్యం జైశంకర్ పాల్గొననున్నారు. మార్చి 22 నాటి సమీక్షకు ఇది కొనసాగింపుగా భావిస్తోన్నారు. నిత్యావసర వస్తువుల నిల్వలు, కృత్రిమ ధరల పెరుగుదలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ సమగ్ర ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని ప్రధాని మోదీ ఇదివరకే పిలుపునిచ్చారు. ఇదే ప్రధాన అజెండాగా సమావేశం ఏర్పాటవుతుంది.
వ్యవసాయం, వాణిజ్యం, రైల్వేలు, షిప్పింగ్, పెట్రోలియం, విద్యుత్, ఆహారం, పౌర విమానయానం వంటి కీలక శాఖలకు చెందిన మంత్రులు సైతం ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగు సీజన్‌కు ముందు ఎరువుల నిల్వలు, విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు, దేశవ్యాప్తంగా నిరంతరాయ విద్యుత్ సరఫరాకు తీసుకుంటున్న చర్యలను కూడా ఈ సమావేశంలో సమీక్షిస్తారని తెలుస్తోంది. రసాయనాలు, ఔషధాలు, పెట్రోకెమికల్స్ కోసం ప్రమాదకర దిగుమతి మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించడంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
-
బీహార్ కు కొత్త సీఎం ఫిక్స్, నితీష్ కు కీలక పదవి..!? -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
"మార్చి" రౌండప్.. అబ్బో ఒక్క నెలలోనే ఇన్ని అనుకోలేదుగా..? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications