నేడు ప్రధాని మోడీ నామినేషన్

వారణాసి : ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9.30గం.లకు బూత్ స్థాయి కార్యకర్తలతో మోడీ మాట్లాడనున్నా మోడీ... 11గంటలకు కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి 11.30గం.లకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.

మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు హాజరుకానున్నారు. అకాలీదళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, లోక్ జనశక్తి పార్టీ నేత రాం విలాస్ పాశ్వాన్‌ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

PM modi to file his nomination today in Varanasi

శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో మోడీ గురవారమే వారణాసికి చేరుకున్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం ప్రధాని మోడీ గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+