సీఎంలతో మోడీ సమావేశం: 27వ తేదీన కరోనా పరిస్థితులపై చర్చ, కేసులు పెరుగుతున్న క్రమంలో..
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ సోమవారం సీఎంలతో కరోనా వైరస్ ప్రభావం, అన్ లాక్ 3.0 గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై.. చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆరోగ్య సేవలు, వ్యుహాలపై ముఖ్యమంత్రులతో మోడీ డిస్కస్ చేయబోతున్నారు.

వరసగా మూడోరోజు కరోనా వైరస్ రికవరీ రికార్డు స్థాయిలో జరిగింది. 34 వేల పైచిలుకు మంది కోలుకోవడంతో 63.45 శాతంగా ఉంది అని కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. కానీ మరణాల శాతం మాత్రం 2.38కి పెరిగిందని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సీఎంలతో వరసగా సమావేశమవుతూ వస్తున్నారు. కరోనా మహమ్మరి కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిర్దేశం చేశారు.
Recommended Video
మార్చి 23వ తేదీన మొదటిసారి లాక్ డౌన్ విధించే ముందు సీఎంలతో సమావేశమయ్యారు. తర్వాత దశలవారీగా అభిప్రాయం తీసుకున్నారు. లాక్ డౌన్ 4.0 ముగిసేలోపు మే నెల చివరివారంలో అమిత్ షా కూడా సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. కేసులు పెరుగుతున్న క్రమంలో సీఎంలతో మోడీ ఇంటరాక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications