ఇక ఇంటింటికీ మోడీ పథకం-ఎల్లుండి నుంచి రెండునెలల ప్రచారం- 21 రాష్ట్రాల్లో...
ఈ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని మోడీ ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసం రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా ప్రజల్ని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని చేరుకోవడం, అర్హులందరికీ ఆ పథకాలు అందేలా చూసేందుకు ఓ భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో జార్ఖండ్ లో నవంబర్ 15న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
గిరిజన నేత బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఖుంటిలోని ఉలిహతు గ్రామం నుంచి 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర'ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. గిరిజనుల జన్మస్థలమైన ఉలిహతును సందర్శించబోతున్న తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం. యాత్ర మొదట్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల నుండి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 25 నాటికి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను కవర్ చేస్తుంది.

3వేల వ్యాన్లతో ఈ యాత్ర రెండు నెలల పాటు కొనసాగుతుంది. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 15వేల పట్టణ ప్రాంతాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది. ప్రతి వ్యాన్ రెండు గంటలపాటు గ్రామ పంచాయతీలో ఉండి, ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్న అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి వాటిని అందేలా చూస్తుంది. దీని ప్రధాన లక్ష్యం దిగువ, మధ్యతరగతి జనాభా. వారు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందేలా చూడటమే.
నవంబర్ 22 వరకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 69 జిల్లాల్లోని 393 ట్రైబల్ బ్లాక్‌లు, 9వేల గ్రామ పంచాయతీలు ఈ యాత్రలో కవర్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ తరువాత ఈ యాత్ర ఇతర గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తారు. చివరికి వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టాలనేది ప్రధాని మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది.
-
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications