కరోనా లాక్‌డౌన్: టైమ్ ఫిక్స్ చేసిన మోదీ.. శుక్రవారం ఉదయం 9కి బీ రెడీ..

దేశంలో గంట గంటకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మహమ్మారికి బలైపోతున్నవాళ్ల సంఖ్యా పైకి ఎగబాకుతున్నది.. ఎటుచూసినా లాక్ డౌన్ ఆదేశాల ధిక్కరణలు.. కొన్ని చోట్ల డాక్టర్లు, వైద్యసిబ్బందిపైనే దాడులు.. అంతలోనే ఉల్లంఘనుల్ని కఠినంగా శిక్షించాలని హోం శాఖ ఆదేశాలు.. దేశ్యవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రం, రాష్ట్రాల మధ్య సంప్రదింపులు.. అటు చూస్తే ప్రపంచమంతటా అల్లకల్లోలం.. అగ్రరాజ్యాలు చిగురుటాకులావణుకుతోన్న వైనం.. ఇంట్లోనే ఉండి.. ఈ వార్తలన్నీ టీవీల్లో చూస్తోన్న జనాలకు ఏదో గుబులు.. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుందని కొందరు.. కాదూ మే 4 వరకూ కొనసాగుతుందని ఇంకొందరు చర్చోపచర్చలు.. సరిగ్గా ఈ సమయంలోనే మన దేశాధినేత మోదీ నుంచి ఒక కబురు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం, ఇప్పటికే దాని బారినపడ్డ రోగులకు అందిస్తోన్న చికిత్స, అత్యవసర సిబ్బంది భద్రత, కేంద్రం నుంచి రాష్ట్రాలు ఆశిస్తోన్న సహాయం, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సమస్యలు... తదితర విషయాలన్నింటిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడమే టార్గెంట్ గా జిల్లా లేదా మండలం ఒక యూనిట్ గా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితోపాటు ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కూడా టీమ్ ఆ యూనిట్లలో భాగస్వాముల్ని చేయాలని ప్రధాని సూచించినట్లు తెలిసింది. కచ్చితంగా మోదీ ఏం చెప్పారో.. సీఎంలు ఎవరు కూడా మీడియాతో పంచుకోలేదు. ఈలోపు ప్రధానమంత్రే స్వయంగా ఓ కీలక ప్రకటన చేశారు..

PM Modi to share video message at 9 am on April 3

''శుక్రవారం ఉదయం సరిగ్గా 9 గంటలకు ఓ వీడియో సందేశాన్ని మీతో పంచుకుంటాను''అని మోదీ తెలిపారు. చివరిసారిగా ఆయన లాక్ డౌన్ ప్రకటన సమయంలో జాతినుద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ జనం ముందుకు వీడియో మెసేజ్ తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ పొడగింపు లేదా ముగింపుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన దానిగురించే ప్రకటన చేస్తారా? లేక కరోనాపై పోరులో కొత్త ఐడియాలు చెబుతారా అన్నది ఉత్కంఠ రేపుతున్నది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+