వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియా గేట్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆవిష్కరించారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది ప్రారంభంలో పరాక్రమ్ దివాస్ (జనవరి 23) నాడు ప్రధాని మోడీ నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదేశంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

నేతాజీ గొప్ప విగ్రహం 280 మెట్రిక్ టన్నుల బరువున్న ఏకశిలా గ్రానైట్ బ్లాక్ నుంచి చెక్కబడింది. నేతాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా ఐఎన్‌ఏ సంప్రదాయ పాట ' కదమ్ కదమ్ బధయే జా ' ట్యూన్‌తో పాటు సాగింది.

PM Modi Unveils 28-Ft-Tall Statue Of Netaji at India Gate, To Inaugurate Kartavya Path next

కొత్తగా నామకరణం చేయబడిన కర్తవ్య మార్గంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ సేవలను తరతరాలకు చాటేందుకు ఇండియా గేట్ వద్ద 28 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేతాజీ విగ్రహానికి ఖమ్మం జిల్లా గ్రానైట్ వినియోగించారు. ప్రఖ్యాత కళాకారుడు అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశారు.

రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది. చుట్టూ పచ్చదనంతో కూడిన ఎరుపు గ్రానైట్ నడక మార్గాలు, పునరుద్ధరించిన కాలువలు, రాష్ట్రాల వారీగా ఫుడ్ స్టాల్స్, కొత్త సౌకర్యాల బ్లాక్‌లు, వెండింగ్ కియోస్క్‌లు ఈ స్ట్రెచ్‌లో ఉన్నాయి. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రారంభోత్సవానికి ముందు నేతాజీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

నేతాజీ విగ్రహం గురించిన ముఖ్య విషయాలు:

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 28 అడుగుల ఎత్తైన విగ్రహం భారతదేశంలోని ఎత్తైన, వాస్తవిక, ఏకశిలా, చేతితో తయారు చేసిన శిల్పాలలో ఒకటి.

తెలంగాణలోని ఖమ్మం నుంచి న్యూఢిల్లీ వరకు 1665 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఈ ఏకశిలా గ్రానైట్ రాయి కోసం 140 చక్రాలతో 100 అడుగుల పొడవున్న ట్రక్కును ప్రత్యేకంగా రూపొందించారు.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, నేతాజీ గొప్ప విగ్రహం 280 ఎంటీ బరువున్న ఏకశిలా గ్రానైట్ బ్లాక్ నుంచి చెక్కబడింది. 26,000 గంటల మనుషుల తీవ్రమైన కళాత్మక ప్రయత్నం తర్వాత, 65 ఎంటీ బరువున్న విగ్రహాన్ని ఉత్పత్తి చేయడానికి గ్రానైట్ ఏకశిలా చెక్కబడింది.

నేతాజీ విగ్రహం పూర్తిగా సాంప్రదాయ పద్ధతులు, ఆధునిక ఉపకరణాలను ఉపయోగించి చేతితో చెక్కబడింది. మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ నేతృత్వంలోని శిల్పుల బృందం ఈ విగ్రహాన్ని రూపొందించింది. గతంలో 2021లో కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ ఆవిష్కరించిన ఆదిశంకరాచార్య 12 అడుగుల విగ్రహాన్ని ఆయన రూపొందించారు.

'నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నమూనాను తయారు చేశాను. దీనిని 40 మంది శిల్పులు చెక్కారు. ఈ రోజు ఇండియా గేట్ వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడం మన అదృష్టం. ఇది 22 అడుగుల పొడవు, 7 టన్నుల బరువు ఉంటుంది. ఇది గ్రానైట్ రాయితో తయారు చేయబడింది' అని శిల్పి నరేష్ కుమావత్‌ వెల్లడించారు.

నేతాజీ జెట్ బ్లాక్ గ్రానైట్ విగ్రహం ఇండియా గేట్‌కు తూర్పున ఉన్న గ్రాండ్ క్యానోపీ క్రింద, తూర్పు-పడమర అక్షం మీద జాతీయ యుద్ధ స్మారకానికి సగం దూరంలో ఉంచబడుతుంది.

English summary
PM Modi Unveils 28-Ft-Tall Statue Of Netaji at India Gate, To Inaugurate Kartavya Path next.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X