Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పశ్చిమ బెంగాల్,అస్సాం మొదటి దశ పోలింగ్ : రికార్డ్ స్థాయిలో యువ స్నేహితులు ఓటెయ్యాలని ప్రధాని మోడీ పిలుపు

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో తొలి దశ పోలింగ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది .ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలిదశ పోలింగ్ జరుగనుంది . అయితే ఇందులో మొదటిగా పశ్చిమ బెంగాల్ , అస్సాం రాష్ట్రాలు సిద్ధమయ్యాయి . రెండు రాష్ట్రాల్లోని మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది . ఈరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది .

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో తొలి దశ పోలింగ్

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో తొలి దశ పోలింగ్

ఇప్పుడిప్పుడే మొదలవుతోంది .ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలిదశ పోలింగ్ జరుగనుంది . అయితే ఇందులో మొదటిగా పశ్చిమ బెంగాల్ , అస్సాం రాష్ట్రాలు సిద్ధమయ్యాయి . రెండు రాష్ట్రాల్లోని మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది . ఈరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది .

 అస్సాం , పశ్చిమ బెంగాల్ లో 77 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్

అస్సాం , పశ్చిమ బెంగాల్ లో 77 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్

అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు .ఇక తొలిదశలో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి . పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం ఎనిమిది దశలలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది . ఇక మొదటి దశ కింద నేడు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.


ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ ,అస్సాం రాష్ట్రాల ప్రజలకు ఈరోజు ఎన్నికల పోలింగ్ లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

 యువ స్నేహితులకు ఓటు వెయ్యాలని మోడీ పిలుపు

యువ స్నేహితులకు ఓటు వెయ్యాలని మోడీ పిలుపు

పశ్చిమ బెంగాల్ , అస్సాం ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వెళ్లి రాష్ట్రానికి ఎన్నికలు జరిగే మొదటి దశలో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. మొదటి దశ ఎన్నికల సమయం ప్రారంభం అవుతుందని, రికార్డు సంఖ్యలో ఓటు వేయడానికి అర్హత ఉన్న వారందరూ వెళ్లాలని కోరుతున్నా అని, ముఖ్యంగా తాను తన యువ స్నేహితులను ఓటు వేయమని పిలుస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

రికార్డు సంఖ్యలో పోలింగ్ నమోదు కావాలని , అందరూ ఓట్లు వెయ్యాలని కోరిన మోడీ

రికార్డు సంఖ్యలో పోలింగ్ నమోదు కావాలని , అందరూ ఓట్లు వెయ్యాలని కోరిన మోడీ

ఇక పశ్చిమబెంగాల్ లోని ఓటర్లకు కూడా తన అభ్యర్థనను తెలియజేశారు. ఓటర్లంతా రికార్డు స్థాయిలో తమ ఓట్లను నమోదు చేయాలని కోరుతున్నా అని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీలు, ఈరోజు పోలింగ్ నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఏవిధంగా ఉంటుంది అన్న ఉత్కంఠలో ఉన్నాయి.

ఇక పోలింగ్ ప్రశాంతంగా సాగటానికి అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+