Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ వ్యాక్సిన్ టూర్ : అహ్మదాబాద్‌లో జైదుస్ క్యాడిలా ప్లాంట్‌ను సందర్శించిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ టూర్ మొదలైంది. మూడు నగరాల పర్యటనలో భాగంగా మొదట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అక్కడి చంగోదర్ పారిశ్రామిక ప్రాంతంలోని జైదుస్ క్యాడిలా బయోటెక్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అభివృద్ది చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ 'జైకోవ్-డి'పై సమీక్ష జరిపారు. పీపీఈ కిట్ ధరించి ‌ప్లాంట్‌లోకి వెళ్లిన ఆయన వ్యాక్సిన్ అభివృద్ది ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.దాదాపు ఒక గంట సమయం పాటు మోదీ అక్కడ గడిపారు.మొదటి దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసిన జైదుస్ క్యాడిలా.. ఈ ఏడాది అగస్టు నుంచి రెండో దశ ప్రయోగాల్లో తలమునకలైంది.

Recommended Video

    PM Modi visits Bharat Biotech | PM Modi In PPE kit, Reviews COVID vaccine development

    మోదీ అహ్మదాబాద్ పర్యటన ముగియడంతో తదుపరి హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హకీంపేట్ విమానాశ్రయంలో దిగనున్న ఆయనకు హకీంపేట్ ఎయిర్‌ ఆసిఫ్ చీఫ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ స్వాగతం పలకున్నారు. అక్కడినుంచి ఆయన నేరుగా జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను సందర్శించి.. అక్కడ అభివృద్ది చేస్తున్న కోవ్యాక్సిన్ వివరాలను అడిగి తెలుసుకుంటారు. హైదరాబాద్ టూర్ అనంతరం పుణేకి బయలుదేరుతారు.

    PM Modi Vaccine Tour, visited Zydus Cadila Plant In ahmedabad Is First Stop

    పుణే సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో అభివృద్ది చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ కోవీషీల్డ్ వ్యాక్సిన్‌తో పాటు, కోవ్యాక్సిన్ వివరాలను అడిగి తెలుసుకుంటారు. కరోనాపై పోరులో కీలకంగా మారనున్న వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ వాడకానికి ఉపయోగించే అవకాశం ఉన్నందునా... వాటి సన్నద్దతను పరిశీలించేందుకే ప్రధాని వ్యాక్సిన్ టూర్‌ చేపట్టారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+